మాస్టర్ క్రేజ్ ను పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకున్న విజయ్ సేతుపతి

ఒక్కోసారి సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా కొందరికి విపరీతమైన పేరు తీసుకొచ్చేస్తుంది. ఇక హీరోను మించిన క్రేజ్ ను సొంతం చేసుకుంటారు కొందరు నటులు. ఆ క్యాటగిరీకి చెందిన నటుడు విజయ్ సేతుపతి. సంక్రాంతికి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో రివ్యూలు రాలేదు కానీ.. ఆడియన్స్ రిసెప్షన్ మాత్రం బాగుంది. తమిళంలో ఆల్రెడీ బిగ్గెస్ట్ హిట్ గా నమోదైన ఈ చిత్రం తెలుగులోనూ హిట్ గా నిలిచే దిశగా సాగుతొంది.

అయితే.. ఈ సినిమాలో హీరో విజయ్ కంటే విలన్ విజయ్ సేతుపతి నటుడిగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు. సినిమాలో కూడా విజయ్ ప్లే చేసిన జెడి కంటే సేతుపతి ప్లే చేసిన భవాని పాత్ర బాగా ఎలివేట్ అయ్యింది. సరిగ్గా రిలీజైన వారం రోజులకి సేతుపతి పుట్టినరోజు కూడా కావడంతో “మాస్టర్” క్రేజ్ క్రెడిట్ మొత్తం సేతుపతి ఎకౌంట్ లోకి వచ్చేసింది. పైగా ఇప్పుడు మాస్టర్ హిందీ రీమేక్ లో కూడా భవాని పాత్రను అక్కడ కూడా సేతుపతి చేత చేయించాలని హిందీ మేకర్స్ ఆలోచిస్తున్నారు.

హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కే ఈ చిత్రంలో గనుక సేతుపతి ఛాన్స్ సొంతం చేసుకుంటే అతడి కెరీర్ గ్రాఫ్ మరో స్థాయికి చేరిపోయినట్లే. ఇక నుంచి సేతుపతి నటించే ప్రతి చిత్రం తెలుగులోనూ డబ్ అవ్వడం అనేది సర్వసాధారణం అయిపోతుంది.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.