అక్కడ విజయ్ సినిమాని మించి నిధి అగర్వాల్ సినిమా ఆడుతుందట..!

నాగ చైతన్య హీరోగా వచ్చిన ‘సవ్య సాచి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నిథి అగర్వాల్. మొదటి చిత్రం ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. నిథికి ఇక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అటు తరువాత అఖిల్ హీరోగా వచ్చిన ‘మిస్టర్ మజ్ను’ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది నిథి అగర్వాల్. కానీ ఆ చిత్రం కూడా నిథికి ఆశించిన స్థాయి హిట్ ను అందించలేకపోయింది. అయితే అటు తరువాత రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం మాత్రం నిథి క్రేజ్ ను మరింత పెంచిందనే చెప్పాలి.

ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడంతో నిథికి తెలుగుతో పాటు తమిళ భాషల్లో కూడా ఆఫర్లు వస్తున్నాయి. ఇదే క్రమంలో నిథి హీరోయిన్ గా నటించిన తమిళ చిత్రం ‘ఈశ్వరన్’ సూపర్ హిట్ అయ్యింది. దాంతో డెబ్యూ మూవీతోనే అక్కడ బ్లాక్ బస్టర్ అందుకుంది నిథి. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే.. విజయ్ వంటి స్టార్ హీరో నటించిన ‘మాస్టర్’ చిత్రాన్ని తలదన్నేలా ఈ చిత్రం అక్కడ రికార్డ్ కలెక్షన్లను నమోదు చేస్తుంది.

మొదట ‘ ‘మాస్టర్’ చిత్రం పక్కన ‘ఈశ్వరన్’ నిలబడుతుందా?’ అని చాలా మంది అనుకున్నారు. ‘మాస్టర్’ దాటికి ‘ఈశ్వరన్’ పచ్చడి పచ్చడి అయిపోతుంది అని కామెంట్లు చేసిన వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేసింది ‘ఈశ్వరన్’. సుశీంద్రన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో శింబు హీరోగా నటించాడు. నిధి ఈ చిత్రంలో పక్కా మాస్ క్యారెక్టర్ పోషించడం విశేషం.ఈమె నటనకి కూడా మంచి మార్కులు పడ్డాయి.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.