మాస్టర్ ఫస్ట్ డే కలెక్షన్స్

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాడు. మెర్సల్, బిగిల్, సర్కార్ వంటి సినిమాలతో తెలుగులో మంచి మార్కెట్ సెట్ చేసుకున్న విజయ్ రానున్న రోజుల్లో తన స్థాయిని మరింత పెంచికునేలా కనిపిస్తున్నాడు. ఇక లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన మాస్టర్ సినిమా బాక్సాఫీస్ వద్ద గట్టిగానే లాగింది. మొదటిరోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విజయ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకుంది.

బిగిల్ సినిమాతోనే విజయ్ రేంజ్ పెరిగినట్లు చాలా క్లియర్ గా అర్ధమయ్యింది. ఇక మాస్టర్ దెబ్బకు మరో లెవెల్ కు వెళ్లింది. మొత్తంగా మొదట రోజు రూ.5.74కోట్ల షేర్స్ ను అందించినట్లు సమాచారం. అంటే మొదటి రోజే సినిమా పెట్టిన పెట్టుబడికి దాదాపు 80% రికవరీ చేసినట్లు క్లారిటీ వచ్చేసింది. ఆల్ మోస్ట్ ఈ సంక్రాంతికి విడుదలైన క్రాక్ సినిమా రేంజ్ లోనే మాస్టర్ కు మంచి కలెక్షన్స్ దక్కాయి.

ఇక ఏరియాల వారిగా కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..

నైజాం 1.49 cr
సీడెడ్ 1.1 cr
ఉత్తరాంధ్ర 0.83 cr
ఈస్ట్ 0.48 cr
వెస్ట్ 0.56 cr
కృష్ణా 0.36 cr
గుంటూరు 0.67 cr
నెల్లూరు 0.25 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 5.74 cr

Click Here To Read Movie Review

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Share.