ఇక అక్కడ రజిని ప్లేస్ ఆ హీరోదేనా..!

దశాబ్దాలుగా తమిళ సినీ పరిశ్రమను రజిని కాంత్ ఏలుతున్నాడు. సౌత్ ఇండియా సూపర్ స్టార్ గా ఉన్న రజిని పేరిట ఉన్న రికార్డ్స్ బాలీవుడ్ హీరోల పేరిట కూడా లేవు. ఎవరైనా ఎదో ఒక టైం లో ఫార్మ్ కోల్పోవాల్సిందే. రజిని కాంత్ పరిస్థితి కూడా ఇప్పుడు అలానే తయారైంది అనిపిస్తుంది. ఈ మధ్య ఆయన నటించిన సినిమాలేవీ ఆశించిన స్థాయి విజయాలు అందుకోవడం లేదు. భారీ వసూళ్ళు దక్కుతున్నప్పటికీ అవి ఆయన స్థాయి వసూళ్లు కాదు. అలాగే ఎక్కవ ధరలకు రజిని సినిమా దక్కించుకున్న డిస్ట్రిబ్యూటర్స్ నష్టాలపాలు కావలసివస్తుంది. దీనితో రజిని నంబర్ వన్ ప్లేస్ గల్లంతే అని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హీరో విజయ్ దూకుడు చూస్తుంటే రజిని స్థానాన్ని అతడు దక్కించుకొనేలా కనిపిస్తున్నాడు.

Vijay with Rajinikanth

విజయ్ గత కొంత కాలంగా వరుస విజయాలు దక్కించుకుంటున్నాడు. ఒకప్పుడు విజయ్ సినిమాలకు ఇతర పరిశ్రమలలో మార్కెట్ ఉండేది కాదు. ఇప్పుడు తెలుగులో కూడా విజయ్ సినిమాలు మంచి విజయాలు నమోదు చేసుకుంటున్నాయి. తేరి, అదిరింది, సర్కార్ తో పాటు లేటెస్ట్ విజిల్ మూవీలు తెలుగులో కూడా మంచి వసూళ్లను దక్కించుకున్నాయి. ఇక బిగిల్ మూవీతో విజయ్ 200 కోట్ల క్లబ్ లో కూడా చేరాడు. ప్రస్తుతం ఆయన లోకేష్ కనకరాజ్ దర్శకత్వం లో చేస్తున్న మాస్టర్ మూవీపై సైతం భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో రజిని స్థానాన్ని విజయ్ తన్నుకెళ్లడం ఖాయం అనే మాట వినిపిస్తుంది. మరో స్టార్ హీరో అజిత్ సైతం వీరిద్దరికీ పోటీగా ఎదుగుతున్నాడు.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.