కన్నడలో సినిమాలో విజయ్ దేవరకొండ..?

‘కె.జి.ఎఫ్’ చిత్రం ఇండియా వైడ్ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ కన్నడ చిత్రం అన్ని భాషల్లోనూ అంత పెద్ద హిట్టవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఈ చిత్రం తో హీరో యశ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సీక్వెల్ లో టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కూడా నటించబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో క్రేజీ టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నాడని టాక్ నడుస్తుంది.

vijay-devarakonda-to-make-cameo-in-kgf2-movie

తాజాగా బెంగుళూర్ లో ‘డియర్ కామ్రేడ్’ మ్యూజిక్ ఫెస్టివల్ లో పాల్గొన్నాడు హీరో విజయ్ దేవరకొండ . ఈ వేడుకకు ‘కె.జి.ఎఫ్’ హీరో యష్ కూడా హాజరయ్యాడు. దీంతో ఈ వార్తలు పుట్టుకొచ్చాయి. ‘యష్’ సినిమాలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడని అందుకే ‘డియర్ కామ్రేడ్’ ప్రమోషన్స్ కు యష్ వచ్చాడని రక రకాలుగా కామెంట్స్ వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకూ నిజముందో చూడాలి..!

Share.