బిగ్ బాస్ 4: విన్నర్ ఎవరో చెప్పేస్తున్న నెటిజన్స్…!

బిగ్ బాస్ రియాలిటీ షో ముగింపు దశకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఎవరి ఫేవరెట్ కంటెంస్టెంట్స్ కి వాళ్లు మద్దతు తెలుపుకుంటున్నారు. చివరగా మిగిలిన ఐదుగురు కంటెస్టెంట్స్ కి సోషల్ మీడియాలో భారీగా ప్రచారం స్టార్ట్ అయ్యింది. అఖిల్, అభిజిత్, హారిక, సోహైల్, అరియానా ఐదుగురుకి కూడా ఓట్ వేయమని రిక్వస్ట్ చేస్తున్నారు. ఈ టైమ్ లోబిగ్ బాస్ లవర్స్ తో పాటుగా సెలబ్రిటీలు, స్టార్ హీరోలు కూడా తమకి నచ్చిన హౌస్ మేట్స్ ఎవరో చెప్తున్నారు.

ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో రౌడీ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ సైతం తన మద్దతుని హౌస్ మేట్స్ కి తెలుపుతున్నాడు. ఇక తనతో పాటుగా లైఫ్ ఈజీ బ్యూటిఫుల్ సినిమాలో నటించిన అభిజిత్ కి ఆల్ ద బెస్ట్ చెప్తూ పోస్ట్ పెట్టాడు ఈ రౌడీ స్టార్. అభిజిత్ ఫోటోని షేర్ చేశాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ టీమ్ తో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ మై బాయ్స్.. ఎల్లప్పుడూ వాళ్లకి నా శుభాకాంక్షలు ఎప్పుడైనా ఎక్కడైనా అంటూ పోస్ట్ చేశాడు. దీంతో ఇప్పుడు అభిజిత్ ఫ్యాన్స్ అందరూ ఈ పిక్ ని తెగషేర్ చేస్తున్నారు.

ఇప్పటికే అభిజిత్ కి నాగబాబు సపోర్ట్ కూడా దొరికింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ మద్దతు కూడా లభించేసరికి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఓటింగ్ ని బట్టీ చూస్తే ఈసారి సీజన్ 4 విన్నర్ గా అభిజిత్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని నెటిజన్స్ షేర్లు కూడా చేసేస్తున్నారు. అదీ మేటర్.

Poll: బిగ్ బాస్ 4 విజేతగా మీరు ఎవరిని భావిస్తున్నారు?

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Share.