నయన తార బాయ్ ఫ్రెండ్ షాకింగ్ కామెంట్స్..!

నయన తార.. సౌత్ లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈమె స్టార్ హీరోయిన్ అనే చెప్పాలి. ఒకప్పుడు వరుసగా తెలుగు సినిమాలు చేసిన నయన తార.. తరువాత ఫేమ్ కోల్పోవడం.. ఆ టైంలో కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చి అదరకొడుతున్న తరుణంలో ఆమెకు అవకాశాలు రాలేదు. అయితే తమిళంలో ఈమె ఒకేసారి హిట్లు మీద హిట్లు కొట్టడం మొదలు పెట్టింది. గ్లామర్ పాత్రలను తగ్గించి హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్స్ చేస్తూ బ్లాక్ బస్టర్లు అందుకుంది. తరువాత ఈమె సూపర్ స్టార్ రేంజ్ కు ఎదిగిపోయింది.

ప్రేమ వ్యవహారాల విషయాల్లో కూడా ఈమె తక్కువేమీ కాదు. మొదట్లో శింబుతో … అటు తర్వాత ప్రభుదేవ తో ప్రేమాయణం నడిపింది. అప్పట్లో ప్రభుదేవాని అయితే నయన్ పెళ్ళి చేసుకోబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. అతను విడాకులు తీసుకోవడానికి కూడా నయన తారే కారణం అంటూ ప్రభుదేవ మాజీ భార్య ఇటీవల శాపనార్ధాలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే..ఆ తర్వాత నుండీ నయన తార .. తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ తో సహజీవనం చేస్తూ వస్తుంది. అయితే ఇప్పటికీ పెళ్ళి చేసుకోలేదు. ఫారిన్ లో ఉన్న నయన తార బిజినెస్ లను కూడా ఈయనే చూసుకుంటూ వస్తున్నాడు.

Vignesh Shivan comments on Nayanthara Pic1

అందుకోసం తరుచూ వీళ్ళు ఫారిన్ టూర్ లకు కూడా వెళ్ళొస్తుంటారు అని.. చెన్నై మీడియా వర్గాలు చెప్పుకొస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. విగ్నేష్ శివన్ కు కూడా నయన్ బ్రేకప్ చెప్పేసింది అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వాటికి ఒక్క పోస్ట్ తో బ్రేక్ వేసాడు విగ్నేష్. నయన్ ఓ ఫారిన్ పిల్లాడిని ఎత్తుకుని ఉన్న ఫోటోని షేర్ చేసి… ‘నా పిల్లలకు భవిష్యత్తులో కాబోయే తల్లి. ఈమె చేతిలో ఉన్న పిల్లాడి తల్లికి మదర్స్ డే శుభాకాంక్షలు’ అంటూ పోస్ట్ చేశాడు విగ్నేష్.

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు 

Share.