విక్టరీ వెంక‌టేష్ `నార‌ప్ప` షూటింగ్ షురూ..!

సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా విక్టరీ ఇంటిపేరుగా చేసుకున్న వెంకటేష్ హీరోగా, మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న భారీ చిత్రం `నారప్ప`. విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో సుందరమ్మగా తెలుగు వారికి చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు. లాక్ డౌన్‌కి ముందే శరవేగంగా 60 రోజుల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర యూనిట్ రీసెంట్‌గా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ హైద‌రాబాద్ ప‌రిస‌ర‌ప్రాంతాల్లో షూటింగ్‌ పునఃప్రారంభించింది. ఈ సంద‌ర్భంగా

Naarappa Action Sequences At Kurumalai

నిర్మాత‌లు సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను మాట్లాడుతూ – “అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండలోని పాల్తూరు గ్రామంలో ‘నారప్పస‌ షూటింగ్ ప్రారంభించి తమిళ నాడులోని కురుమలై మ‌రియు తిరిచందూర్ సమీపంలో ఉన్న తెరికాడు రెడ్ డెసర్ట్ లో కీలక యాక్షన్ సన్నివేశాలు షూట్ చేశాం. క‌రోనా వ్యాప్తి కార‌ణంగా నిలిపివేసిన షూటింగ్‌ని త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ రీసెంట్‌గా హైద‌రాబాద్‌లో తిరిగి ప్రారంభించాం. ప్రియమణి, రావు రమేష్, రాజీవ్ కనకాల త‌దిత‌ర‌ ప్రధాన తారాగణమంతా పాల్గొనగా కీలకమైన సన్నివేశాలు మరియు క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నాం. ఈ షెడ్యూల్‌తో 80 శాతం షూటింగ్‌ పూర్తవుతుంది. మిగిలిన ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలను పూర్తిచేసి త్వ‌ర‌లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువ‌స్తాం” అన్నారు.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Share.