ప్లాప్ డైరెక్టర్ కి అల్లు అరవింద్ ఛాన్స్!

‘ఎక్కడకి పోతావు చిన్నవాడా’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు వి.ఐ.ఆనంద్ ఆ తరువాత అల్లు శిరీష్ హీరోగా ‘ఒక్క క్షణం’ సినిమా తీశాడు. సినిమా కమర్షియల్ గా వర్కవుట్ అవ్వనప్పటికీ మంచి కాన్సెప్ట్ అనిపించుకుంది. ఈ రెండు సినిమాలు కూడా థ్రిల్లర్ జోనర్ లోనే తెరకెక్కించారు. ఈ సినిమాల వర్క్ ని చూసిన రవితేజ.. వి.ఐ. ఆనంద్ తో కలిసి పని చేయాలనుకున్నాడు. వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘డిస్కో రాజా’ సినిమా డిజాస్టర్ అయింది.

దీంతో దర్శకుడిగా అతడికి మరో ఛాన్స్ రావడానికి సమయం పడుతుందనుకున్నారు. కానీ ఇప్పుడు గీతాఆర్ట్స్ బ్యానర్ లో సినిమా ఛాన్స్ వచ్చింది. నలుగురు కమెడియన్లను హీరోలుగా పెట్టి సినిమా తీయడానికి రెడీ అవుతున్నాడు వి.ఐ.ఆనంద్. ఇందులో ఒక పాత్ర కోసం కమెడియన్ సత్యను తీసుకోగా.. మరో పాత్రకు శ్రీనివాస్ రెడ్డిని ఫైనల్ చేశారు. మిగిలిన ఇద్దరు కమెడియన్లను కన్ఫర్మ్ చేయనున్నారు. కామెడీ థ్రిల్లర్ జోనర్ లో ఈ సినిమా ఉంటుందట.

త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన రానుందని సమాచారం. నిజానికి ‘ఒక్క క్షణం’ సినిమా సమయంలో గీతాఆర్ట్స్ లో మరో సినిమా చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నాడు వి.ఐ.ఆనంద్. బన్నీ కోసం ఓ కథ కూడా సిద్ధం చేశాడు. కానీ ఆ సినిమా వర్కవుట్ అవ్వలేదు. ఇప్పుడు దానికి బదులుగా ఈ కామెడీ థ్రిల్లర్ చేయనున్నాడు. ఈ ప్రయోగం వర్కవుట్ అయి సక్సెస్ ఇస్తుందేమో చూడాలి!

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Share.