‘అరణ్య’ కోసం గొంతు అరువిచ్చిన వెంకీ మామ

సినిమాల్లో ఒకరికి మరొకరు గొంతు అరువివ్వడం కొత్త విషయమేమీ కాదు. చాలా రోజుల నుండి ఇలా డబ్బింగ్‌లు చెప్పడం సాగుతూనే ఉంది. అయితే స్టార్‌ హీరోలు డబ్బింగ్‌ చెప్పడం అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. తాజా అలా వెంకటేశ్‌ ఓ పాత్రకు డబ్బింగ్‌ చెప్పబోతున్నారు. అందులోనూ రానా ప్రధాన పాత్రలో వస్తున్న సినిమాకి. త్వరలో విడుదలవుతున్న ‘అరణ్య’ కోసమే వెంకటేశ్‌ ఈ ఫీట్‌ చేస్తున్నాడు. ‘అరణ్య’ సినిమాలో రానా తండ్రి పాత్రకు వెంకటేశ్‌ డబ్బింగ్‌ చెప్పారట.

అయితే ఆ తండ్రి పాత్ర పోషించింది ఎవరు అనే విషయంలో స్పష్టత లేదు. కానీ ఆ పాత్రకు బాబాయ్‌ వెంకటేశ్‌ గొంతు అరువు ఇచ్చారని రానా ట్వీట్‌ చేశాడు. ఈ నెల 26న సినిమా థియేటర్లలోకి రానుంది. ఇటీవల విడుదల చేసిన సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. అడవి, ఏనుగులు నేపథ్యంలో సాగనున్న ఈ సినిమాకు మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యింది. నిజానికి 11 నెలల క్రితమే సినిమా విడుదల అవ్వాల్సింది.

గతేడాది ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. అయితే కరోనా – లాక్‌డౌన్‌ కారణంగా సినిమా వాయిదా పడుతూ వచ్చింది. మధ్యలో ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేసేస్తారనే ప్రచారమూ సాగింది. కానీ చిత్రబృందం ఎప్పటికప్పుడు ఈ వార్తలను ఖండిస్తూ… ఎట్టకేలకు ఇప్పుడు రిలీజ్‌ చేస్తోంది.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.