మామ- అల్లుళ్ళ సినిమాకి రిలీజ్ డేట్ ఫిక్స్?

ఈ ఏడాది ఇప్పటికే మామా అల్లుళ్ళు బ్లాక్ బస్టర్లు కొట్టి మంచి ఫామ్ లో ఉన్నారు. ఆ మామా అల్లుళ్ళు ఈపాటికే మీకు తెలిసిపోయుంటుందిగా… అదేనండీ మన విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్యలు. ఈఏడాది ‘ఎఫ్2’ తో వెంకీ… అలాగే ‘మజిలీ’ తో చేయ్.. వాళ్ళ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఇక వీళ్ళిద్దరూ కలిసి ఓ చిత్రం చేస్తుంటే.. ప్రేక్షకులు ఏ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఆశిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారి అంచనాలకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని ‘పవర్’ ‘జై లవ కుశ’ ఫేమ్ బాబీ తెరకెక్కిస్తున్నాడు.

venky-mama-movie-release-day-fixed1

ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్.. 80 శాతం పూర్తయ్యింది. మొదట ఈ చిత్రాన్ని అక్టోబర్ 5 న విడుదల చేయాలనుకున్నారు. కానీ అక్టోబర్ 2 న మెగాస్టార్ చిత్రం ‘సైరా నరసింహరెడ్డి’ కూడా ఉండడంతో విడుదల తేదీ ని పోస్ట్ పోన్ చేసుకున్నారు. మరి ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తారా అనుకుంటున్న టైములో ఇప్పుడు ఆ విషయం పై క్లారిటీ వచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని అక్టోబర్ 25 న విడుదల చేయబోతున్నారట. ఎలాగూ దీపావళి కూడా ఉంది కాబట్టి సినిమాకి మంచి వసూళ్ళు వస్తాయని చిత్ర యూనిట్ భావిస్తుంది. ‘సురేష్ ప్రొడక్షన్స్’ ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్, చైతన్య సరసన రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Share.