సంక్రాంతి బరిలో వెంకీ మామ కూడా.. కాకపోతే..!

సంక్రాంతికి వెంకీ మామ అల్లుడు చైతన్యతో కలిసి మరో మారు అలరించడానికి వచ్చేశారు. థియేటర్స్ లోకి కాదు, ఏకంగా ఇంటిలోకి దిగిపోయాడు. విషయంలో కి వెళితే విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా దర్శకుడు బాబీ తెరకెక్కించిన వెంకీ మామ మూవీ క్రిస్మస్ కానుకగా గత ఏడాది డిసెంబర్ 13న విడుదలైంది.మామ అల్లుళ్ళ మధ్య నడిచే కామెడీ, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.ఐతే లాభాలతో బయటపడి హిట్ మూవీగా నిలిచింది. అక్కడక్కడా థియేటర్స్ లో రన్ కొనసాగుతుండగానే వెంకీ మామ మూవీ డిజిటల్ ఫార్మట్ లో అందుబాటులోకి వచ్చింది.

Venky Mama Day 3 collection stronger than the first day1

వెంకీ మామ మూవీ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ వెంకీ మామ మూవీని విడుదలైన నెల రోజుల్లోపే అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈనెల 12న వెంకీ మామ మూవీ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది.సంక్రాంతి తెలుగు ఇళ్లలో వెంకీ మామ మూవీ సందడి చేయనుంది.పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం డిజిటల్ ఫార్మాట్ లో విశేష ఆదరణ దక్కించుకోవడం ఖాయం. పండక్కి వచ్చిన బంధు మిత్రులతో… ఇంటిల్లిపాది ఇంట్లో కూర్చొని ఆనందిస్తారు.వెంకీ మామ చిత్ర విషయం లో అమెజాన్ ప్రైమ్ పండుగ సందర్భాన్ని చక్కగా ఉపయోగించుకుంది. వెంకీ మామ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి.రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటించారు. థమన్ సంగీతం అందించారు.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Share.