‘వెంకీమామ’ పై మరింత క్రేజ్ పెంచిన అల్లుడు..!

నిజజీవితంలో మామా అల్లుళ్ళు అయిన వెంకటేష్, నాగ చైతన్య లు కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘వెంకీమామ’. ‘ప్రేమమ్’ సినిమాలో కాసేపు కనిపిస్తేనే థియేటర్లు దద్దరిల్లాయి. అలాంటిది ఇద్దరూ కలిసి ఫుల్ లెంగ్త్ మూవీ చేస్తే ఎలా ఉంటుందో.. చూడాలని మూడేళ్ళ నుండీ వెంకీ, చైతు అభిమానులు మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి డైరెక్టర్ బాబీ ఈ కాంబినేషన్లో సినిమాని తెరకెక్కించడానికి రెడీ అయ్యాడు. పోస్టర్లతోనే ఈ చిత్రానికి ఓ రేంజ్ హైప్ వచ్చింది. ఇక ‘ఫస్ట్ గ్లిమ్ప్స్’ విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈరోజు నాగచైతన్య పుట్టినరోజు కావడంతో ‘అల్లుడి గ్లిమ్ప్స్’ అంటూ మరో టీజర్ ను విడుదల చేశారు.

Venky Mama Movie Glipmse Review1

‘నా మేనల్లుడి లవ్ స్టోరీ ‘టైటానిక్’ రేంజ్ లో ఉంటుందనుకున్నా.. కానీ ఊర్లో పడవ రేంజ్ లో కూడా లేదు రా’ అంటూ వెంకటేష్ డైలాగ్ తో టీజర్ మొదలైంది. కెప్టెన్ కార్తీక్ శివరాం వీరమాచినేని గా మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో నాగచైతన్య ను ఈ చిత్రంలో చూపించాడు బాబీ. ఈ చిత్రంలో ఎంటర్టైన్మెంట్ తో పాటు యాక్షన్ డోస్ కూడా ఎక్కువగానే ఉన్నట్టు ఈ టీజర్ బట్టి అర్థమవుతుంది. అయితే ఈ టీజర్ తో అయినా రిలీజ్ డేట్ చెబుతారు అనుకుంటే.. ఈసారి కూడా హ్యాండ్ ఇచ్చారు దర్శకనిర్మాతలు.ఏదేమైనా ఈ టీజర్ మాత్రం ఆకట్టుకునే విధంగా ఉంది. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.


“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్! 

Share.