ప్రమోషన్ల జోరు పెంచిన ‘వెంకీమామ’

ఎప్పుడెప్పుడా అని అటు దగ్గుబాటి అభిమానులు, అక్కినేని అభిమానులు మాత్రమే కాదు యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచుటస్థున్న ‘వెంకీమామ’ చిత్రాన్ని ఎట్టకేలకు డిసెంబర్ 13న విడుదల చేస్తున్నట్టు నిన్న రానా, డైరెక్టర్ కె.ఎస్.రవీంద్ర(బాబీ) ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే రోజున వెంకటేష్ పుట్టినరోజు కూడా కావడంతో మరింత హైప్ ఏర్పడింది. ‘సురేష్ ప్రొడక్షన్స్’ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘కోన ఫిలిం కార్పొరేషన్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Venky Mama Movie Release Date Fixed

ఇక విడుదలకు మరో 10 రోజులు మాత్రమే టైం ఉండడంతో.. ప్రమోషన్ల డోస్ ను పెంచుతున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. ఈ క్రమంలో రేపు ‘కోకాకోలా పెప్సీ’ అంటూ సాగే ఓ పాటని రేపు( డిసెంబర్ 4న) సాయంత్రం 4:05 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు చిత్ర యూనిట్ సభ్యులు. ‘సినిమాలో ఉన్న ఒకే ఒక్క మాస్ పాట ఇదని.. అందరినీ అలరించేలా ఈ పాట ఉంటుందని’ ఈమధ్యే తమన్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. అసలే తమన్ ఈ మధ్య ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. వరుసగా హిట్ సాంగ్స్ ఇస్తున్నాడు కాబట్టి ఈ పాట కూడా స్టెప్పులేయించే విధంగా ఉంటుందని అంతా భావిస్తున్నారు.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.