Narappa Trailer: ఉత్కంఠభరిత యాక్షన్‌ ఎపిసోడ్లతో వెంకీ `నారప్ప` ట్రైలర్‌!

దగ్గుబాటి వెంకటేష్ – ప్రియమణి జంటగా నటించిన నారప్ప సినిమా మొత్తానికి రిలీజ్ కు సిద్ధమైంది. తమిళ్ మూవీ అసురన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న నారప్ప థియేట్రికల్ గా కాకుండా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల కావడానికి సిద్ధమైంది. ఈ నెల 20న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే నిజంగా ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేశాడా అనే అనుమానం కలుగుతోంది. ఎక్కడా కూడా ఆయన పోలికలు కనిపించలేదు. వీలైనంత వరకు ఒరిజినల్ కథను స్క్రీన్ పైకి తెచ్చినట్లు అనిపిస్తోంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ విషయంలో శ్రీకాంత్ అస్సలు తగ్గలేదని అర్ధమయ్యింది. భయంతో బ్రతికేవాడు.. తిరగబడితే ఎలా ఉంటుంది అని కాన్సెప్ట్ ను ట్రైలర్ లోనే చాలా బలంగా చూపించారు.

మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు. డబ్బుంటే లాగేసుకుంటారు. కానీ చదువును మాత్రం మన దగ్గరి నుంచి ఎవరు తీసుకోలేరు అంటూ వెంకటేష్ చెప్పిన డైలాగ్ ఎంతగానో ఆలోచింప జేస్తోంది. వెంకీ యాక్షన్ సీన్స్ కూడా సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నాయని హైప్ గట్టిగానే క్రియేట్ చేశారు. అసురన్ సినిమా అసలు పాయింట్ ను ఏ మాత్రం మిస్ అవ్వకుండా ప్రజెంట్ చేశారని క్లియర్ గా అర్ధమయ్యింది. మరి సినిమా ఏ స్థాయిలో పాజిటివ్ రాక్ ను అందుకుంటుందో చూడాలి.


పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Share.