చిరు సినిమా కోసం మాంటేజ్ షాట్లు!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘వేదాళం’ రీమేక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తమిళంలో అజిత్ హీరోగా నటించిన ఈ సినిమాను తెలుగులో ఐదేళ్ల తరవాత రీమేక్ చేస్తున్నారు. చాలా కాలం విరామం తరవాత డైరెక్టర్ మెహర్ రమేష్ ఈ సినిమా కోసం మళ్లీ మెగా ఫోన్ పడుతున్నారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాదిలో మొదలవుతుందని అన్నారు. కానీ ఈ సినిమా షూటింగ్ మొదలైపోయిందని టాక్. ఈ సినిమాకి సంబంధించి కొన్ని మాంటేజ్ షాట్లు చిత్రీకరించారని టాక్.

కలకత్తా నేపథ్యంలో సాగే సినిమా ఇది. అక్కడ దసరా పండుగను ఎంతో గొప్పగా జరుపుకుంటారు. ఈ క్రమంలో చిత్రబృందానికి కొన్ని మాంటేజ్ షాట్లు కావాల్సివచ్చాయి. అందుకే దసరా సందర్భంగా చిత్రబృందం కలకత్తా వెళ్లి, అక్కడ ఉత్సవాలను షూట్ చేసి వచ్చిందట. ఆ ఫుటేజీని ‘వేదాళం’ రీమేక్ లో వాడుకోబోతున్నారు. ఈ రకంగా చూస్తే ‘వేదాళం’ రీమేక్ మొదలైపోయినట్లే. 2021 దసరా లోపు ఈ సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నారు. అందుకే ఇప్పుడే దసరా ఉత్సవాలను కవర్ చేసి.. ముందు జాగ్రత్తగా దాచి పెట్టుకున్నారు.

ఈ సినిమాలో కొన్ని సీన్లలో చిరు గుండు గెటప్ లో కనిపించనున్నారు. అందుకే ఇటీవల గుండుతో లుక్ టెస్ట్ కూడా చేయించుకున్నారు. ఈ సినిమాలో చిరు సోదరి పాత్రలో కీర్తి సురేష్ కనిపించబోతుందని సమాచారం. ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించనున్నారు.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Share.