‘గద్దలకొండ గణేష్’ గట్టెక్కేసేలా ఉన్నాడే..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పక్కా మాస్ అవతారంలో తెరకెక్కిన చిత్రం ‘గద్దలకొండ గణేష్’. హరీశ్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 20న విడుదలై పాజిటివ్ టాక్ నే సంపాదించుకుంది. మొదటి నాలుగు రోజులు ఈ చిత్రం బ్రహ్మాండమైన కలెక్షన్స్ ను రాబట్టింది. మొదటి వారమే బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ లిస్ట్ లో చేరుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత డౌన్ అయ్యింది ఈ చిత్రం. అయితే మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ విడుదలతో వరుణ్ సినిమా ఇబ్బందుల్లో పడింది. థియేటర్ల కొరత ఏర్పడడంతో కలెక్షన్స్ పై ప్రభావం పడింది.

varun-tej-with-chiranjeevi-latest-pic

‘గద్దలకొండ గణేష్’ కు 25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 17 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 24.2 కోట్లను రాబట్టినట్టు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుండే రూ.21 కోట్ల వరకూ రావడం విశేషం. ఓవర్సీస్ లో మాత్రం ఈ చిత్రం నష్టాల్నే మిగిల్చేలా ఉంది. మరి ఈ వారం పూర్తయ్యే సరికి బ్రేక్ ఈవెన్ అవ్వుద్దో లేదో చూడాలి. ఏదేమైనా ‘సైరా’ పోటీని తట్టుకుని కూడా ఈ చిత్రం 2 కోట్ల వరకూ షేర్ ను నమోదు చేయడం.. గ్రేట్ అనే చెప్పాలి..!

సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Share.