కిక్కిచ్చే అప్డేట్ రెడీ చేసిన వరుణ్ తేజ్

మెగా హీరో వరుణ్ తేజ్ చెల్లి పెళ్లి తరువాత మళ్ళీ సినిమాలతో చాలా బిజీ అయ్యాడు. ఒకేసారి రెండు సినిమాలను సెట్స్ పైకి తెచ్చి వరుసగా అప్డేట్స్ కూడా వదులుతున్నాడు. ఇటీవల F3 ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసిన వరుణ్ లాక్ డౌన్ కంటే ముందే మొదలు పెట్టిన బాక్సింగ్ స్టోరీ షూటింగ్ ను కూడా కంటిన్యూ చేస్తున్నాడు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్స్ తో బిజీగా మారిన వరుణ్ త్వరలోనే ఒక స్పెషల్ అప్డేట్ ఇవ్వబోతున్నాడు.

వరుణ్ చివరగా 2019లో గద్ధలకొండ గణేష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక రెండేళ్ల గ్యాప్ వచ్చింది కాబట్టి వెంటనే రెండు సినిమాలను లైన్ లోకి తెచ్చాడు. ఇక బాక్సింగ్ డ్రామాగా తెరకెక్కుతున్న వరుణ్ పదవ సినిమా అప్డేట్ ను ఇవ్వబోతున్నారు. ఈ నెల 19న వరుణ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ను 10:10గంటలకు విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సార్ గా కనిపించబోతున్నాడు.

బాక్సింగ్ ట్రైనింగ్ కోసం వరుణ్ అప్పట్లో స్పెషల్ గా విదేశాలకు వెళ్లి ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఇక సినిమాలో కన్నడ హీరో ఉపేంద్ర ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా కొత్త దర్శకుడు కిరణ్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. అల్లు వెంకటేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అంధించనున్నాడు.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!</strong

Share.