‘గద్దలకొండ గణేష్’ హిట్ తో రెమ్యూనరేషన్ పెంచేసిన వరుణ్ తేజ్..!

‘ముకుంద’ ‘కంచె’ వంటి సినిమాలతో మంచి పేరు తెచుకున్నప్పటికీ.. సరైన హిట్టందుకోవడానికి చాలా టైం పట్టింది. ‘ఫిదా’ చిత్రంతో మొదటి హిట్ అందుకున్నాడు వరుణ్. ఆ తరువాత ‘తొలిప్రేమ’ ‘ఎఫ్2’ వంటి చిత్రాలతో సూపర్ హిట్లందుకున్నాడు. అయితే అవి క్లాస్ సినిమాలు. కానీ ‘గద్దలకొండ గణేష్’ తో మాస్ ను కూడా మెప్పించగలను అని ప్రూవ్ చేసుకున్నాడు వరుణ్. మొదట మాస్ ప్రయత్నం ‘లోఫర్’ ‘మిస్టర్’ వంటి సినిమాలు బెడిసికొట్టడంతో.. ‘వరుణ్ మాస్ కు పనికిరాడు’.. అనే కామెంట్స్ వినిపించాయి.

vt10-movie-launch

ఎలాగూ మాస్ ను కూడా మెప్పించాడు కాబట్టి.. ఇప్పుడు వరుణ్ సినిమా రేంజ్ మరింత పెరిగింది. దీంతో ఇప్పటివరకూ 3,4 కోట్ల వరకే రెమ్యూనరేషన్ తీసుకుంటూ వచ్చిన వరుణ్.. ఇప్పుడు 7 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నాడట. ఇక ఎలాగు మంచి మార్కెట్ ఉంది కాబట్టి నిర్మాతలు కూడా వరుణ్ అడిగినంత ఇవ్వడానికి రెడీ అంటున్నారని సమాచారం. ప్రస్తుతం అల్లు బాబీ నిర్మాణంలో కిరణ్ కొర్రపాటి అనే దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాడు వరుణ్.

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Share.