వరుణ్ తేజ్ సినిమాలో హీరోయిన్ మారలేదు!

బాక్సింగ్ నేపథ్యంలో వరుణ్ తేజ్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీవీ వినాయక్, హరీష్ శంకర్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసిన కిరణ్ కొర్రపాటి డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఆల్రెడీ వైజాగ్‌లో 16 డేస్ షెడ్యూల్ చేశారు. హైదరాబాద్ సిటీలో భారీ షెడ్యూల్ చెయ్యాలని ప్లాన్ చేయగా, కరోనా వల్ల కుదరలేదు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ షూటింగ్ స్టార్ట్ చెయ్యడానికి ప్లాన్ చేశారు. నవంబర్ 2న హైదరాబాద్‌లో సినిమా లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.

మార్చి వరకు షూటింగ్ కంటిన్యూ అవుతుందట. వరుణ్ తేజ్, నవీన్ చంద్రతో పాటు సినిమాలో ఇంపార్టెంట్ యాక్టర్లపై సీన్లు షూటింగ్ చెయ్యనున్నారు. హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక, ఢిల్లీ వెళ్లి ఒక వారం రోజుల పాటు కొన్ని సీన్లు తీస్తారట. అలాగే, వైజాగ్‌లో ఒక సాంగ్ షూట్ చెయ్యనున్నారు. ఎలా లేదన్నా సినిమా కంప్లీట్ కావడానికి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ వరకు టైమ్ పడుతుంది. సల్మాన్ ఖాన్ ‘దబాంగ్ 3’లో ఫ్లాష్ బ్యాక్‌లో హీరోయిన్‌గా యాక్ట్ చేసిన సాయి మంజ్రేకర్ ఈ సినిమాలో వరుణ్ తేజ్ జోడీగా యాక్ట్ చేస్తోంది.

Varun Tej Boxer movie shooting details1

కరోనా తదనంతర పరిస్థితుల నేపథ్యంలో డేట్స్ క్లాష్ రావడంతో ఆమె స్థానంలో నభా నటేష్‌ను సెలెక్ట్ చేశారని రూమర్లు వినిపించాయి. దర్శకుడు ఆ రూమర్లలో నిజం లేదని చెబుతున్నారు. ఆల్రెడీ వైజాగ్ షెడ్యూల్లో వరుణ్ తేజ్, నవీన్ చంద్రతో కలిసి సాయి మంజ్రేకర్ యాక్ట్ చేశారు. సో… ఆమెను రీప్లేస్ చేసే ఆలోచన లేదు. ఒకవేళ చేస్తే మళ్ళీ 16 రోజులు తీసిన సీన్లు కొత్తగా తీయాలి. సాయి మంజ్రేకర్ కూడా సినిమా మీద ఇంట్రెస్ట్ గా వుందట. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Share.