Induvadana Teaser: పర్వాలేదనిపించిన వ‌రుణ్ సందేశ్ ‘ఇందువ‌ద‌న’ టీజ‌ర్..!

గతంలో వరుణ్ సందేశ్ కూడా లవర్ బాయ్ గా ఓ వెలుగు వెలిగిన వాడే. ‘హ్యాపీ డేస్’ కొత్త బంగారు లోకం’ ‘ఏమైంది ఈవేళ’ వంటి హిట్ సినిమాలతో పాటు మరో నాలుగు యావరేజ్ సినిమాల్లో కుడా హీరోగా నటించాడు. అయితే తర్వాత సరైన కథలు ఎంపిక చేసుకోవడంలో విఫలమవ్వడం, కొత్త హీరోల పోటీకి కూడా తట్టుకుని నిలబడలేకపోవడంతో వరుణ్ సందేశ్ త్వరగానే ఫేడౌట్ అయిపోయాడు. అయితే ‘బిగ్ బాస్3’ లో కంటెస్టెంట్ గా పాల్గొని ప్రేక్షకులను అలరించి..

మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. అంతేకాదు ‘ఇందువదన’ అనే మూవీతో మళ్ళీ హీరోగా రీ ఎంట్రీ కూడా ఇస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లలో భాగంగా తాజాగా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. వరుణ్ సందేశ్ కు జోడీగా ఫర్నాజ్ శెట్టి హీరోయిన్ గా నటించింది. ఫస్ట్ లుక్,ఫ‌స్ట్ సింగిల్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పై అంచనాలు ఏర్పడ్డాయి. ఇక తాజాగా విడుదల చేసిన టీజర్ విషయానికి వస్తే..

పీరియాడికల్ … అదీ గ్రామీణ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ మరియు హారర్ ఎలిమెంట్స్ తో ఈ మూవీని తెరకెక్కినట్టు టీజర్ స్పష్టం చేసింది.’కేరింత’ ఫేమ్ పార్వతీశం, మహేష్ విట్టా ల కామెడీ కూడా ఆకట్టుకునేలా కనిపిస్తుంది. టీజర్ అయితే పర్వాలేదు అనిపిస్తుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :


ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Share.