వరలక్ష్మీ ఇక తెలుగులో సెట్ అయిపోయినట్టే..!

3 ఏళ్ళుగా రవితేజ.. 9 ఏళ్ళుగా అల్లరి నరేష్.. ఒక్కటంటే ఒక్క హిట్టు కొట్టడానికి కిందా మీదా పడుతూ వచ్చారు. ఎట్టకేలకు 2021 లో వాళ్ళు సాలిడ్ కొట్టి కంబ్యాక్ ఇచ్చారు. రవితేజ ‘క్రాక్’ తో అలాగే అల్లరి నరేష్ ‘నాంది’ తో హిట్లు అందుకున్నారు.అయితే ఈ రెండు సినిమాల్లోనూ నటి వరలక్ష్మీ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. దాంతో ‘ప్లాప్ హీరోలకు గోల్డెన్ లెగ్ గా మారిపోయింది వరలక్ష్మీ’ అంటూ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఈమె కెరీర్ ప్రారంభం నుండీ తమిళంలో హీరోయిన్ గా కంటే ఎక్కువగా విలన్ రోల్స్ అలాగే నెగిటివ్ రోల్స్ ను పోషిస్తూ వస్తోంది. కానీ అక్కడ ఈమె నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ తెలుగులో మాత్రం ఈమెకు మంచి గుర్తింపు దక్కుతుంది. ‘పందెం కోడి2’ ‘సర్కార్’ వంటివి డబ్బింగ్ సినిమాలే అయినప్పటికీ.. అవి అక్కడ కంటే తెలుగులోనే హిట్ అయ్యాయి. ఆ రెండు చిత్రాల్లోనూ వరలక్ష్మీ పాత్ర హైలెట్ గా నిలుస్తుంటుంది.

‘ 9 ఏళ్లుగా కోలీవుడ్లో వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ… అక్కడ రాని గుర్తింపు తెలుగులో దక్కింది.ఇక్కడి ప్రేక్షకులు నన్ను బాగా ఆదరిస్తున్నారు. తమిళంలో కంటే తెలుగులోనే మంచి కథా ప్రాధాన్యత ఉన్న సినిమాలు నాకు దక్కుతున్నాయి’ అంటూ ఇటీవల ‘నాంది’ సక్సెస్ మీట్లో వరలక్ష్మీ చెప్పుకొచ్చింది. తెలుగులో ఈమెకు మరిన్ని ఆఫర్లు కూడా దక్కుతున్నట్టు ఇన్సైడ్ టాక్.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.