వాళ్లు నాతో అసభ్యంగా ప్రవర్తించారు : వరలక్ష్మి శరత్ కుమార్

గత కొన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ కొంతమంది నటీమణులు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్లు ఇలాంటి కామెంట్లు చేయకపోయినా కొత్త హీరోయిన్లు, సినిమాల్లో అవకాశాలు తగ్గిన నటీమణులు, చిన్న పాత్రల్లో నటించిన ఆర్టిస్టులు ఇలాంటి ఆరోపణలు ఎక్కువగా చేశారు. అయితే బ్యాక్ గ్రౌండ్ ఉన్నా క్యాస్టింగ్ కౌచ్ బాధలు తప్పవని ప్రముఖ నటి వరలక్ష్మి కామెంట్లు చేయడం గమనార్హం. తమిళంలో పదుల సంఖ్యలో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు వరలక్ష్మి శరత్ కుమార్.

ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైన వరలక్ష్మి శరత్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నానని చెప్పారు. సపోర్టింగ్ రోల్స్ లో ఎక్కువగా నటిస్తున్న వరలక్ష్మికి బాయ్స్, ప్రేమిస్తే సినిమాల్లో ఛాన్స్ వచ్చినా కొన్ని కారణాల వల్ల ఆమె ఆ సినిమాల్లో నటించలేదు. 2012 సంవత్సరంలో శింబు హీరోగా తెరకెక్కిన పోడా పోడి నటిగా వరలక్ష్మికి తొలి సినిమా. ఒక ఇంటర్వ్యూలో వరలక్ష్మి కెరీర్ ప్రారంభంలోనే సినీ రంగానికి చెందిన కొంతమంది తనతో అసభ్యంగా ప్రవర్తించారని చెప్పారు.

క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడటం వల్ల సినిమా ఆఫర్లు తగ్గినా కెరీర్ లో సక్సెస్ అవుతామని వరలక్ష్మి అన్నారు. తాను నటించిన తార తప్పట్టై సినిమా చూసి అమ్మ కన్నీళ్లు పెట్టుకున్నారని.. నాంది సినిమా చూసి అమ్మ ఎమోషనల్ అయ్యారని వరలక్ష్మి తెలిపారు. 2020 సంవత్సరం జూన్ నెలలో లైఫ్ ఆఫ్ పై పేరుతో చిన్న బేకింగ్ కంపెనీని ప్రారంభించానని.. స్టార్టప్ కావడంతో అన్ని పనులు తానే చేస్తున్నానని వరలక్ష్మి అన్నారు. బిజినెస్ బాగానే ఉందని ఆర్డర్లు బాగానే వస్తున్నాయని వరలక్ష్మి చెప్పారు. భవిష్యత్తులో పేద ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాల్లోకి వస్తానని వరలక్ష్మి వెల్లడించారు.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.