సంచలనం సృష్టిస్తున్న వరలక్ష్మి పెళ్ళి కామెంట్స్..!

‘డేరింగ్ అండ్ డాషింగ్’ అనే తరహాలో తాను అనుకున్నది ధైర్యంగా చెప్పేస్తుంటుంది నటి వరలక్ష్మి శరత్ కుమార్. సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తెగా ఇండస్ట్రీలో కొనసాగుతుంది వరలక్ష్మి. ఇక ఈమె పెళ్ళి టాపిక్ పై కోలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పుడూ డిస్కషన్లు నడుస్తూనే ఉంటుంటాయి. గతంలో హీరో విశాల్‌ తో ప్రేమలో ఉందని.. త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్ళిచేసుకోబోతున్నారని టాక్ నడిచిన సంగతి తెలిసిందే. అయితే అలాంటిదేమీ లేదని… మేము స్నేహితులమే అంటూ వీళ్ళిద్దరూ తేల్చేసారు.

varalakshmi-sarathkumar-openups-about-her-marriage1

ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ తమిళ మ్యాగజైన్ 2019లో పెళ్ళి చేసుకోబోయే తారల లిస్ట్ అంటూ ఓ కథనం రాసుకొచ్చింది. ఈ లిస్ట్ లో వరలక్ష్మి పేరుని కూడా చేర్చింది మ్యాగజైన్. దీని పై వరలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అంతేకాదు తన పెళ్ళికి సంబంధించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. “నిజజీవితంలో నాకు పెళ్ళి చేసుకోవాలని లేదు. భవిష్యత్తులో నేను ఎవ్వర్నీ పెళ్ళి చేసుకోను” అంటూ ఘాటుగా బదులిచ్చింది. వరలక్ష్మి చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Share.