మొత్తం వరుణ్ తేజ్ షోనే ఎక్కువ ఉందిగా…!

14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట కలిసి నిర్మిస్తున్న తాజా చిత్రం ‘వాల్మీకి’. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. కోలీవుడ్ హీరో అధర్వ మురళి కూడా ఈ చిత్రంలో మరో హీరోగా నటిస్తున్నాడు. పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ మరియు ‘జర్రా జర్రా’ మాస్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మిక్కీ జె మేయర్ సంగీతంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 20 న విడుదల చేయబోతున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్లను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఈరోజు ట్రైలర్ ను విడుదల చేశారు.

valmiki-trailer-review1

‘ఈ మథ్య కాలంలో ఇంటిల్లిపాది కూర్చుని చూసే సినిమాలు ఎక్కడొస్తున్నాయి’ అనే దర్శకుడు హరీష్ శంకర్ పైత్యపు డైలాగుతో ట్రైలర్ మొదలైంది. ఆ వెంటనే మరో హీరో అధర్వ మురళి ‘ఓ మంచి సినిమా తీస్తాను’ అని చెప్తాడు. ‘ఫామ్ హౌస్లో ఉన్న డాన్ ని కాదు.. ఫామ్లో ఉన్న గ్యాంగ్ స్టర్ ని వెతికి పట్టుకోవాలి’ అనే పంచ్ డైలాగ్ రాగానే వరుణ్ తేజ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంలో ‘వరుణ్ గద్దల కొండ గణేష్’ అనే పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటి వరకూ సాఫ్ట్ లుక్ లో కనిపిస్తూ వచ్చిన వరుణ్ ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో విశ్వరూపం చూపించాడని ఈ ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది. ఇక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో పూజా ఎంట్రీ ఇచ్చింది. ఆమెతో ‘గవాస్కర్ సిక్సు కొట్టుడు… బప్పిలహరి పాట కొట్టుడూ… నేను సినిమా చూపించుడు సేం టు సేం…’ అంటూ వరుణ్ చెప్పే డైలాగ్ కూడా ఆకట్టుకుంటుంది. అంతేనా ‘నా పైన పందాలేస్తే గెలుస్తారు… నాతోటి పందాలేస్తే చస్తారు’ అనే డైలాగ్ ట్రైలర్ కే హైలెట్ అని చెప్పొచ్చు. తమిళంలో ‘జిగర్తాండ’ సినిమాకి ఇది రీమేక్. ఈ చిత్రం తెలుగులో కూడా డబ్ అయ్యింది. కాబట్టి కథ అందరికీ తెలిసిందే. ఏదేమైనా ‘వాల్మీకి’ ట్రైలర్ అయితే సూపర్..! మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

Share.