పవన్ సినిమాకి క్రేజీ డీల్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వేణుశ్రీరామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్ ను లాయర్ గెటప్ లో చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

ప్రముఖ ఛానెల్ జీ తెలుగు ఈ రైట్స్ ను దక్కించుకున్నట్లు సమాచారం. నిర్మాత దిల్ రాజు, జీ తెలుగు ప్రతినిధుల మధ్య చర్చలు పూర్తయ్యాయట. ఓ స్టార్ హీరో సినిమాకి శాటిలైట్ రైట్స్ డీల్ ఇంత ఆలస్యంగా జరగడం ఆశ్చర్య కలిగించే విషయమే అయినా.. దీని వెనుక చాలా పెద్ద స్టోరీ నడిచింది. ‘వకీల్ సాబ్’ సినిమా సెట్స్ పైకి వెళ్లిన వెంటనే జెమినీ ఛానెల్ రంగంలోకి దిగింది. దిల్ రాజుతో సూచనప్రాయంగా ఓ ఒప్పందం కుదుర్చుకుంది.

అయితే ఆ ఛానెల్ కి, దిల్ రాజుకి మధ్య ఏం జరిగిందో కానీ ఆఖరి నిమిషంలో డీల్ నుండి సదరు ఛానెల్ తప్పుకుంది. అలా జెమినీ తప్పుకోవడంతో ఆ అవకాశాన్ని జీ తెలుగు అందుకోవాలనుకుంది. దాదాపు రూ.15 కోట్లు చెల్లించి ఈ డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమా శాటిలైట్ హక్కులకు ఫ్యాన్సీ రేటు పలికిందనే చెప్పాలి. సంక్రాతి కానుకగా రేపు సాయంత్రం ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. టీజర్ తో పాటు సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారేమోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Share.