Vakeel Saab Collections: 2021 లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్..!

3 ఏళ్ళ తరువాత ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ నుండీ వచ్చిన చిత్రం ‘వకీల్ సాబ్’.బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసాడు. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు, బోణి కపూర్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. శృతీ హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగెళ్ళ వంటి భామలు కూడా కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 9న(నిన్న) విడుదలైన ఈ చిత్రానికి హిట్ టాక్ లభించింది. దాంతో సినిమాకి మంచి ఓపెనింగ్సే నమోదయ్యాయని చెప్పాలి.

వాటి వివరాలను ఓ సారి పరిశీలిస్తే :

నైజాం  8.75 cr
సీడెడ్  4.50 cr
ఉత్తరాంధ్ర  3.85 cr
ఈస్ట్  3.10 cr
వెస్ట్  4.50 cr
గుంటూరు  3.94 cr
కృష్ణా  1.90 cr
నెల్లూరు  1.70 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)   32.24 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   1.82 cr
ఓవర్సీస్   2.40 cr
వరల్డ్ వైడ్ (టోటల్)  36.46 cr

వకీల్ సాబ్’ చిత్రానికి 89.85కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 90.5కోట్ల వరకూ షేర్ ను రాబట్టాలి.మొదటి రోజు ఈ చిత్రం 36.46 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 53.39 కోట్ల షేర్ ను రాబట్టాలి.

Click Here To Read Movie Review

Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Share.