టాలీవుడ్‌ ఫ్యాన్స్‌లో కొత్త పోరు… ఎందుకంటే

టాలీవుడ్‌లో సోషల్‌ మీడియా యుద్ధాలు ఈ మధ్య సర్వసాధారణమైపోయాయి. ఏదైనా సినిమా వస్తోందన్నా, టీజర్‌/ట్రైలర్‌/పోస్టర్‌/టైటిల్‌ ఇలా ఏది వస్తున్నా ఫ్యాన్స్‌ వార్‌ జరుగుతూనే ఉంది. కొన్నిసార్లు ఇది హెల్దీగా ఉంటే, ఇంకొన్నిసార్లు వెగటు పుట్టిస్తోంది. తాజాగా మరోసారి సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ వార్‌ మొదలైంది. అయితే సారి ఒక సినిమా హీరో, ఒక్క సినిమా కూడా హిట్‌ కొట్టని హీరో ఫ్యాన్స్‌ మధ్య. ఇప్పటికి ఈ వార్‌ చూడటానికి సరదాగా ఉన్నా, తర్వాతర్వాత ఆ హీరోల సినిమాలు వచ్చినప్పుడు ఇంకేమవుతుందో అని తటస్థులు అనుకుంటున్నారు.

మెగా కాంపౌండ్‌ నుంచి కొత్తగా వచ్చిన హీరో వైష్ణవ్‌ తేజ్‌, చాలా ఏళ్ల క్రితం అక్కినేని కాంపౌండ్‌ నుంచి వచ్చిన అఖిల్‌ మధ్య ఇప్పుడు ఫ్యాన్‌ వార్‌ నడుస్తోంది. ‘ఉప్పెన’కు ప్రేక్షకుల నుండి మంచి స్పందనే వస్తుండటం ఈ వార్‌కి కారణమైంది. అఖిల్‌ హీరోగా పరిచయం అయ్యి దాదాపు ఆరేళ్లు అయ్యింది. అయినా ఇంకా హిట్‌ రాలేదు. రీఎంట్రీ, రీరీ ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు రీరీరీ ఎంట్రీకి రెండీ అవుతున్నాడు. మరోవైపు వైష్ణవ్‌తేజ్‌ ‘ఉప్పెన’తో ఆకట్టుకున్నాడని పరిశీలకులు అంటున్నారు.

దీంతో అఖిల్ కంటే వైష్ణవ్ తేజ్ చాలా బెటర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. భవిష్యత్తులో అఖిల్, వైష్ణవ్ తేజ్‌ మద్య పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే కచ్చితంగా వైష్ణవ్‌ తేజ్‌దే పైచేయి అవుతుందని సోషల్‌ వార్‌ సారాంశం. అయితే అక్కినేని అభిమానులు మాత్రం అఖిల్‌ భవిష్యత్తులో స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకుంటాడని అంటున్నారు. చూద్దాం భవిష్యత్తులో ఏమవుతుందో?

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Share.