ఆరోజు రిలీజ్ చేస్తే ఫలితం ఎలా ఉంటుంది..!

సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఉప్పెన. సిల్వర్ స్క్రీన్ పైన మెగా మేనల్లుడు ఎంట్రీ చాలా గ్రాండ్ గా ఉండాలని ప్లాన్ చేస్తే, లాక్డౌన్ మెగా ఆశలపై నీళ్లు జల్లింది. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 3వ తేదిన విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ, సినిమా కంప్లీట్ అయినా కూడా థియేటర్స్ లేక ఆపేశారు. తర్వాత ఓటీటీలు ఈ సినిమాకోసం అడిగినా కూడా మూవీ టీమ్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. సంక్రాంతికి పెద్ద సినిమాల పోటీ ఉండటంతో ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఫిబ్రవరి 14వ తేదిన ప్రేమికుల రోజు ఉంది కాబట్టి , ఆరోజు రిలీజ్ చేస్తే బాగుంటుందని చిత్రయూనిట్ ఆలోచిస్తోందట. ఫిబ్రవరి 4, 12 ఇలా రకరకాల డేట్స్ వినిపించినా ఫైనల్ గా ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే రోజు సినిమాని విడుదల చేసేందుకు చూస్తున్నారు.

సుకుమార్ దగ్గర వర్క్ చేసిన బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న ఈసినిమాపై యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడంతో అందరూ ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. హీరోయిన్ కృతి శెట్టి స్పెషల్ ఎట్రాక్షన్ గా, తమిళ విలన్ విజయ్ సేతుపతి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఈ సినిమా తెరకెక్కింది. రీసంట్ గా రిలీజైన టీజర్ కూడా సినీ ప్రేమికులని విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాదు, హీరో రఫ్ లుక్ తో ఉండటం, హీరోయిన్ క్లాసీ లుక్ లో ఉండటం, ఇద్దరి మధ్యలో ప్రేమ చివరికి ఏమవుతుంది అనే సస్పెన్స్ ఇలా టీజర్లో చాలా విషయాలని చూపించారు.

సాంగ్స్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది కాబట్టి ఫ్రెష్ లవ్ స్టోరీగా తెలుగు ఇండస్ట్రీలో మంచి హిట్ కొడుతుందనే కాన్ఫిడెంట్ గా ఉంది చిత్రయూనిట్. అందుకే ఈ సినిమాని ప్రేమికులరోజు రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మరి లాస్ట్ ఇయర్ ఇదే ప్రేమికుల రోజున విజయ్ దేవరకొండ సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితం ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా మెగా యంగ్ హీరోకి ఇండస్ట్రీలో ఫస్ట్ హిట్ ఇస్తుందా లేదా అనేది చూడాలి.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.