ఈ ఉగాదికి పెద్ద హిట్ కొట్టేలా ఉందిగా..!

‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు, హర్షిత్ రెడ్డి,శిరీష్ లు కలిసి నిర్మిస్తున్న తాజా చిత్రం ‘వి’. సుధీర్ బాబు హీరోగా నాని నెగిటివ్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం మార్చి 25న విడుదల కాబోతుంది. ఇప్పటివరకూ లవ్ స్టోరీలు, ఎంటర్టైనింగ్ చిత్రాలు తెరకెక్కిస్తూ వచ్చిన దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ తొలిసారి ఫుల్ యాక్షన్ జోనర్ లో ‘వి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక నాని సరసన నివేదా థామస్ .. అలాగే సుధీర్ బాబు సరసన అదితి రావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తుండగా తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబందించిన టీజర్ ను విడుదల చేశారు. మరి ఆ టీజర్ ఎలా ఉందొ ఓ లుక్కేద్దాం రండి.

V Movie Teaser Review1

‘ఫూల్స్ మాత్రమే రూల్స్ గుడ్డిగా ఫాలో అవుతారు సర్, అప్పుడప్పుడు నా లాంటోడు కొద్దిగా రూల్స్ బ్రేక్ చేస్తుంటాడంతే’ అనే డైలాగ్ తో టీజర్ మొదలైంది. పోలీస్ ఆఫీసర్ గా సుధీర్ బాబు ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉన్నాడు. ఇక సడెన్ గా విలన్ లా నాని ఎంట్రీ ఇచ్చాడు. కొంతమందిని మర్డర్లు చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తిగా కనిపిస్తున్నాడు. నెగిటివ్ రోల్ చేస్తున్న నానిని హీరో సుధీర్ బాబు ఛేజ్ చేస్తున్న సీన్ కూడా ఉంది. ‘న్యాయాన్ని,ధర్మాన్ని కాపాడ్డానికి నువ్వొస్తున్నావనగానే విజిల్స్ వేయడానికి నేనేమి నీ ఫ్యాన్ కాదురా’ అనే డైలాగ్ నిజంగా విజిల్స్ వేయించేలా ఉంది. ‘సోదాపు .. దమ్ముంటే నన్ను ఆపు’ అనే పంచ్ డైలాగ్ కూడా అలరించే విధంగా ఉంది. అబ్బా తమన్ మొన్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నిరాశపరిచాడు కానీ… ఈసారి మాత్రం కుమ్మి పడేసాడనే చెప్పాలి. పి.జి.విందా సినిమాటోగ్రఫి హాలీవుడ్ సినిమాల రేంజ్లో ఉంది. టీజర్ అయితే అదిరిపోయింది. ఈ ఉగాదికి కచ్చితంగా పెద్ద హిట్ కొట్టేలా ఉంది. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.


వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!

Share.