అరెరె.. ఇంద్రగంటి ప్లానింగ్ అంతా అప్సెట్ అయ్యిందే..!

‘వి’ సినిమా ఫలితం ఇంద్రగంటి మోహన్ కృష్ణ కెరీర్ పై ప్రభావం చూపిస్తుందనే చెప్పాలి. ఆ చిత్రం హిట్ అయితే స్టార్ డైరెక్టర్ల నుండీ కూడా ఇంద్రగంటికి పిలుపు వచ్చి ఉండేదేమో..! కానీ ఇప్పుడు మీడియం రేంజ్ హీరోలు కూడా ఇతన్ని వెయిటింగ్ లిస్ట్ లో పెట్టే పరిస్థితి ఏర్పడింది.నిజానికి ‘వి’ పూర్తయిన తరువాత నాగ చైతన్యతో ఓ సినిమా చెయ్యాలి అనుకున్నాడు ఇంద్రగంటి. కథ చెప్పడం.. చైతూ ఓకే అనడం కూడా జరిగిపోయింది.

దిల్ రాజుకే ఇంద్రగంటి మరో సినిమా చేసి పెట్టాలనే కమిట్మెంట్ ఉంది కాబట్టి.. ఈ ప్రాజెక్టు కన్ఫర్మ్ అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు దిల్ రాజు నిర్మాణంలోనే ‘థాంక్యూ’ అనే చిత్రం చేస్తున్నాడు చైతన్య. దీనికి విక్రమ్ కుమార్ దర్శకుడు. ఇంద్రగంటితో చైతన్య సినిమా చెయ్యాలి అంటే మరో నిర్మాతతో చెయ్యాలి. చైతన్య సినిమాతో పాటు విజయ్ దేవరకొండతో కూడా సినిమా చేస్తున్నట్టు ఇంద్రగంటి ప్రకటించాడు. ‘మజిలీ’ నిర్మాత సాహు గారపాటి ఈ ప్రాజెక్టుని నిర్మిస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి.

V movie effect on director Indraganti Mohan Krishna1

అయితే విజయ్ దేవరకొండ ‘ఫైటర్’ అనే పాన్ ఇండియా ప్రాజెక్టుని ఫినిష్ చేసుకుని రావాల్సి ఉంది.దాంతో ఇక్కడ కూడా ఇంద్రగంటి వెయిట్ చెయ్యాల్సిందే. కాబట్టి ఇంద్రగంటి…. చైతూ కోసం వెయిట్ చెయ్యడమే బెటర్ అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. చూడాలి మరి.. ఈ యంగ్ డైరెక్టర్ చివరికి ఎవరితో ప్రాజెక్టు సెట్ చేసుకుంటాడో..!

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Share.