ఫిబ్రవరి 5న ‘ఉప్పెన’!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ఉప్పెన’. ఈ చిత్రానికి సుకుమార్ కథ అందించగా.. శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ చిత్రంలో కీ రోల్ పోషించడంతో ఈ సినిమాకి కోలీవుడ్ లో కూడా మంచి హైప్ వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన పాటలను విడుదల చేయగా అవి మిలియన్ల వ్యూస్ దక్కించుకొని రికార్డులు క్రియేట్ చేశాయి.

హీరోయిన్ క్రితి శెట్టి ఫ్రెష్ లుక్‌తో ఆకట్టుకోవడంతో చాలా మంది ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అన్నీ సెట్ అయి సినిమా రిలీజ్ చేద్దామనుకునే టైమ్ లో కరోనా వచ్చి పడింది. దీంతో సినిమా రిలీజ్ ఆగిపోయింది. అప్పటినుండి తొమ్మిది నెలలుగా ఈ సినిమా ల్యాబ్ లోనే ఉండిపోయింది. అయితే ఈ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయనున్నట్లు.. నెట్ ఫ్లిక్స్ తో డీల్ కుదుర్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేస్తుందని అంతా అనుకున్నారు.

Big problem for Uppena movie1

కానీ దర్శకనిర్మాతలు మాత్రం సినిమాను థియేటర్లో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 5న ఈ సినిమాను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ మంచి టైం.. ‘భీష్మ’, ‘ఛలో’, ‘మిర్చి’ లాంటి సినిమాలు ఫిబ్రవరి నెలలోనే రిలీజై సూపర్ హిట్ అయ్యాయి. అందుకే ఆ టైమ్ ను ఎంచుకున్నారు. సంక్రాంతి కానుకగా సినిమా టీజర్ ను విడుదల చేయనున్నారు.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Share.