సినిమాలో హీరో చచ్చిపోతాడా..?

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతున్నట్లుగా మూవీ టీమ్ ప్రకటించింది. అందుకోసం ఒక టీజర్ ని కూడా సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల చేశారు. దేవుడే వరాలు ఇస్తాడని నాకు అర్ధమైంది. ఎవరికి పుట్టామో అందరికీ తెలుస్తుంది.. కానీ, ఎవరికోసం పుట్టామో నాకు చిన్నప్పుడే తెలిసిపోయింది అంటూ హీరో వాయిస్ తో స్టార్ట్ అయ్యింది ఈ టీజర్. హీరో హీరోయిన్ కి ఉన్న ప్రేమని చాలా అందమైన సీన్స్ లో చూపిస్తూ చాలా ఉత్సాహంగా టీజర్ లో షాట్స్ ని కట్ చేశారు.

హీరోయిన్ బీచ్ లో లవ్ యు ఐ అని రాస్తే, ఐ లవ్ యూ అని కదా రాయాలి అని హీరో అమాయకంగా అడగడం.., మనిద్దరి మద్యలో ప్రేమ ఎందుకని చెప్పి అలా రాశానని హీరోయిన్ అనడం. ఇవన్నీ కూడా వాళ్ల మద్యలో ఘాటమైన ప్రేమని తెలిపేలా ఉన్నాయి. అంతేకాదు, టీజర్ ఎండింగ్ లో ఈ ఒక్కరాత్రే 80 సంవత్సరాల వరకూ గుర్తుండిపోయేలా బతికేద్దాం అంటూ హీరోయిన్ చెప్తోంది. ఆ తర్వాత హీరో బీచ్ లో గాయలతో పడిపోయి ఉన్నాడు. దీన్ని బట్టీ చూస్తే వీళ్ల ప్రేమకి విలన్ గా విజయ్ సేతుపతి హీరోని చంపిచేస్తాడా అన్నట్లుగా ఉంది.

అంతేకాదు, సినిమా ట్రాజెడీ ఎండింగ్ లా, లాస్ట్ కి హీరో చచ్చిపోతాడా అని అనుమానం కలిగేలా కూడా టీజర్ లో చూపించేశారు. ఇక ఈ టీజర్ చూసినవాళ్లంతా కూడా ప్యూర్ లవ్ స్టోరీ అని, చాలాకాలం తర్వాత చక్కటి తెలుగు లవ్ స్టోరీ వస్తోందని, హీరో వైష్ణవ్ చాలా నేచరల్ గా యాక్ట్ చేశాడని కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్ కృతి శెట్టి కి అయితే కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు. అదీ మేటర్.


క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Share.