‘ఉప్పెన’ 18 డేస్ కలెక్షన్స్!

సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ‘ఉప్పెన’ చిత్రం విడుదలయ్యి 18 రోజులు కావస్తున్నా కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గడం లేదనే చెప్పాలి. ఫిబ్రవరి వంటి అన్ సీజన్లో.. ఓ పక్క కొత్త కొత్త సినిమాలు విడుదలవుతున్నా.. ఇంకా ఈ చిత్రం స్ట్రాంగ్ రన్ ను కొనసాగిస్తూ ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచే విషయం. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేశాడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ మరియు ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్ల పై నవీన్ యర్నేని, వై.రవి శంకర్, సుకుమార్ లు కలిసి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలయ్యింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో రూపొందిన పాటలు, హీరోయిన్ కృతి శెట్టి లుక్స్ వంటివి మొదటి నుండీ ఈ చిత్రం పై భారీ అంచనాలు నమోదయ్యేలా చేసాయి.

దాంతో 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసిన ఈ చిత్రం 18 రోజుల కలెక్షన్లను ఓసారి గమనిస్తే :

నైజాం   15.06 cr
సీడెడ్     7.45 cr
ఉత్తరాంధ్ర     8.30 cr
ఈస్ట్     4.86 cr
వెస్ట్     2.54 cr
గుంటూరు     2.86 cr
కృష్ణా     3.04 cr
నెల్లూరు     1.69 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)    45.81 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా     2.28 cr
ఓవర్సీస్     1.35 cr
వరల్డ్ వైడ్ (టోటల్)   49.44 cr  (షేర్)

 

‘ఉప్పెన’ చిత్రానికి 20.5 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు 21కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉండగా.. ఆ టార్గెట్ ను 3 రోజుల్లోనే ఫినిష్ చేసింది ఈ చిత్రం. ఇక 18 రోజులు పూర్తయ్యేసరికి ఏకంగా 49.44 కోట్ల షేర్ ను రాబట్టి.. ఇప్పటికీ స్ట్రాంగ్ గా రన్ అవుతోంది.దీంతో 28.44 కోట్ల లాభాలను బయ్యర్లకు అందించింది ఈ చిత్రం. 3వ సోమవారం కూడా ఈ చిత్రం 0.42కోట్ల షేర్ ను రాబట్టింది.మరో 2 రోజుల్లో ఈ చిత్రం 50కోట్ల షేర్ ను కూడా అధిగమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Click Here To Read Movie Review

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.