ఉప్పెన దర్శకుడిని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు!

సినిమా ఇండస్ట్రీలో ఫామ్ లో ఉన్న దర్శకులకు వచ్చే ఆఫర్స్ అన్ని ఇన్ని కావు. ప్రస్తుతం ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుకు కూడా ఆఫర్స్ కోకొల్లలుగా వస్తున్నాయి. కానీ అతన్ని బయటకు వదలకుండా మైత్రి మూవీ మేకర్స్ మరో రెండు సినిమాలను నిర్మించేందుకు బుక్ చేసేసుకుంది. ఇప్పట్లో అతను బయట ప్రొడక్షన్ లో సినిమాలు చేసే అవకాశం అయితే లేదు. ఇక హీరోలు అతనిపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు చాలా క్లారిటీగా అర్ధమవుతుంది.

అతనే కావాలని కొందరు మైత్రి మూవీ మేకర్స్ ను ఇబ్బంది పెడుతున్నట్లు టాక్. ఇప్పటికే ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు రోజుకో రూమర్ వైరల్ అవుతూనే ఉంది. అయితే బుచ్చిబాబు మాత్రం ప్రస్తుతం ఒక కథను రెడీ చేసుకున్నట్లు చెబుతూ ఇంకా హీరో ఎవరనేది ఫిక్స్ అవ్వలేదని క్లారిటీ ఇచ్చేశాడు. ఇక అక్కినేని వారి చూపు కూడా బుచ్చిబాబుపైనే ఉన్నట్లు టాక్ వస్తోంది. అఖిల్ కోసం స్టోరీ సెట్ చేయమని నాగార్జున ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ తో చర్చలు జరిపారు.

ఇక దర్శకుడు బుచ్చిబాబు అయితే బెటర్ అనే విధంగా మరో మాట కూడా చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అఖిల్ సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఒకవేళ బుచ్చిబాబు కథ సెట్ చేస్తే సురేంధర్ రెడ్డి మూవీ అనంతరం ఈ కాంబో సెట్టయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.