మెగాహీరో మరో సినిమా రిలీజ్ చేస్తున్నాడా..?

సరిగ్గా నెల క్రితం ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే సినిమాను రిలీజ్ చేశాడు మెగాహీరో సాయి ధరమ్ తేజ్. థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. కలెక్షన్ల పరంగా మాత్రం ఈ సినిమా దూసుకుపోయింది. ఈ సినిమా రిలీజ్ తరువాత సాయి ధరమ్ తేజ్.. దేవకట్టా దర్శకత్వంలో ఓ కొత్త సినిమాను మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ దాదాపు 70 శాతానికి పైగా పూర్తయింది.

దీంతో షార్ట్ గ్యాప్ లో ఈ సినిమాను కూడా థియేటర్లోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారట. ఈ సినిమాకి ‘రిపబ్లిక్’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు చాలా కాలంగా వార్తలొస్తున్నాయి. దాదాపు ఇదే టైటిల్ ను ఫిక్స్ చేయబోతున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఏప్రిల్ 30న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. దీనికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఫిబ్రవరి నెలాఖరులోపు మొత్తం టాకీ పార్ట్ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.

రిలీజ్ డేట్ ఏప్రిల్ 30 అని డెడ్ లైన్ పెట్టుకొని డబ్బింగ్ వర్క్ కూడా మొదలుపెట్టారు. ఈ సినిమా పూర్తయిన తరువాత కార్తిక్ దండు దర్శకత్వంలో మరో సినిమాను పట్టాలెక్కించనున్నాడు ఈ మెగాహీరో. సుకుమార్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమాను కూడా ఇదే ఏడాదిలో రిలీజ్ చేయాలనేది సాయి ధరమ్ తేజ్ ప్లాన్. సో మొత్తానికి ఈ ఏడాది మొత్తం తన సినిమాలతో థియేటర్లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు ఈ మెగాహీరో.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.