శృతికి రూ.20 లక్షలు తగ్గించి ఇచ్చారట!

‘వకీల్ సాబ్’ సినిమా కోసం హీరోయిన్ వెతికి వెతికి చివరికి శృతిహాసన్ ను తీసుకున్నారు. ఆఖరి నిమిషంలో ఆమె షూటింగ్ లో జాయిన్ అయింది. పేరుకి హీరోయిన్ పాత్ర అయినప్పటికీ.. సినిమాలో గెస్ట్ రోల్ మాదిరి ఉంటుందట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అలా కనిపించే వెళ్లిపోయే క్యారెక్టర్ లో శృతి కనిపించనుంది. అసలే స్క్రీన్ స్పేస్ తక్కువ ఉంటుందని అనుకుంటుంటే.. ఇప్పుడు దిల్ రాజు శృతి స్క్రీన్ స్పేస్ ను మరింత తగ్గించేశారట.

నిజానికి శృతిహాసన్ ను, పవన్ కళ్యాణ్ ను సెట్స్ పైకి తీసుకురావడానికి దిల్ రాజుకి చాలా కష్టమైందట. మరోపక్క పవన్ వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేయాలంటూ దిల్ రాజుకి చెప్పడంతో.. చేసేదేం లేక పవన్-శృతి కాంబినేషన్ లో తీయాల్సిన పాటను పక్కన పెట్టేశారట. పాట లేకుండానే షూటింగ్ ని పూర్తి చేసేసారు. దీంతో సినిమాలో శృతిహాసన్ కనిపించే నిడివి ఇంకా తగ్గిపోయింది. అంతేకాదు.. పాట షూటింగ్ లేకపోవడంతో శృతికి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ను కూడా తగ్గించి ఇచ్చినట్లు సమాచారం.

దాదాపు రూ.20 లక్షలు తగ్గించి శృతికి రెమ్యునరేషన్ సెటిల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈరోజు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు ‘వకీల్ సాబ్’ టీజర్ రాబోతుంది. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. అంజలి, నివేదా థామస్, అనన్య ముఖ్య పాత్రలు పోషించారు.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Share.