నితిన్ పెళ్ళి పై క్లారిటీ వచ్చేసింది…!

యూత్ స్టార్ నితిన్ ఇటీవల ‘భీష్మ’ చిత్రంతో హిట్ అందుకుని ఫామ్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అదే జోష్ లో నాలుగు సినిమాలు చేయడానికి కూడా రెడీ అవుతున్నాడు. ఇదే క్రమంలో పెళ్ళి చేసుకోవడానికి కూడా రెడీ అయ్యాడు. షాలిని రెడ్డితో నితిన్ పెళ్ళి ఈ ఏప్రిల్ 16 న దుబాయ్ లో జరపడానికి ప్లాన్ చేసారు.కానీ ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ బాగా పెరిగింది కాబట్టి అక్కడకు వెళ్ళే ఛాన్స్ లేదు.

పైగా అక్కడే కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో అక్కడ జరిపే ఛాన్స్ లేదు. ఈ క్రమంలో నితిన్ పెళ్ళి వాయిదా పడటం ఖాయమని అంతా అనుకున్నారు. పైగా డెస్టినేషన్ వెడ్డింగ్ కావడంతో అంతా ఆగిపోతుంది అని అనుకున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం… నితిన్ పెళ్ళి ఆగిపోలేదట. ఏప్రిల్ 16నే నితిన్ పెళ్ళి జరుగనుందట. వధువు షాలినీ రెడ్డి ఇంట నే ఈ వివాహం జరుగనుందట.

Update on Hero Nithin Wedding1

కొద్దిపాటి బందువులు… మిత్రుల సమక్షంలో ఈ వివాహం జరుగునుందట. కరోనా తీవ్రత తగ్గిన తర్వాత.. ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలందరికీ గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేసాడట నితిన్. అంతేకాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యాచిలర్ పార్టీ ఇవ్వలేడు కాబట్టి … ఆ పార్టీని కూడా పెళ్ళైన తరువాత ప్లాన్ చేసాడట నితిన్. ఇక తాజాగా … కరోనా వైరస్ వల్ల.. ఇబ్బంది పడుతున్న ప్రజలకు… తన వంతుగా 20 లక్షల వరకూ విరాళం అందించాడు నితిన్.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Share.