పాపం అప్డేట్స్ లేక ఏది పడితే అది వైరల్ చేసేస్తున్నారు

కరోనా కారణంగా అందరికంటే ఎక్కువగా ఇబ్బందిపడుతున్న పరిశ్రమ సినిమా ఇండస్ట్రీ. పదుల సంఖ్యలో టీం మెంబర్స్ ఉండడం కంపల్సరీ కావడం, లొకేషన్ లో సోషల్ డిస్టెన్స్ మైంటైన్ చేయడం అనేది అసాధ్యం కాబట్టి పెద్ద పెద్ద సినిమాల షూటింగ్స్ అన్నీ మళ్ళీ నిరవధికంగా ఆగిపోయాయి. చిరంజీవి ఆచార్య, ఎన్టీఆర్-రామ్ చరణ్ ల “ఆర్ ఆర్ ఆర్”, ప్రభాస్ “సలార్”, మహేష్ 27వ సినిమా. ఇలా భారీ ప్రొజెక్ట్స్ షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి.

కరోనా టైంలో రిస్క్ చేసి మరీ పరశురామ్ షూటింగ్ కోసం మహేష్ దుబాయ్ వెళ్ళినప్పటికీ.. మహేష్ పర్సనల్ మేకప్ మ్యాన్ కి కరోనా రావడంతో షూటింగ్ ఆపేసి, స్వయంగా మహేష్ బాబు కొన్నాళ్లు ఐసోలేషన్ లోకి వెళ్ళడం జరిగాయి. దాంతో హీరోల అభిమానులు సరైన అప్డేట్స్ లేక తహతహలాడుతున్నారు. మరీ ముఖ్యంగా మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు” అనంతరం ఏడాది గ్యాప్ వచ్చేసింది. మధ్యలో కొన్ని ఫోటోస్ వచ్చాయి కానీ,

అఫీషియల్ లుక్ మాత్రం రిలీజ్ అవ్వలేదు. దాంతో నిన్న సాయంత్రం ఎవరో ఒక నార్త్ టిక్ టాకర్ ఫోటో ఒకటి మహేష్ కొత్త ఫోటోగా హల్ చల్ చేసింది. కాస్త క్లియర్ గా చూస్తే అది మహేష్ కాదు అని అర్ధమవుతున్నా.. అప్డేట్స్ లేక దొరికిన ఫేక్ ఫోటోను కూడా అఫీషియల్ ఫోటో అన్నట్లుగా సోషల్ మీడియాలో ట్రెండ్ కూడా చేసేశారు కొందరు అభిమానులు.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Share.