బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

బిగ్‌బాస్‌ ఇంట్లో ఎనర్జీ అంటే హారిక.. హారిక అంటే ఎనర్జీ. ఇంట్లోకి వచ్చిన తొలి రోజు నుంచి తనదైన శైలిలో ఎంటర్‌టైన్‌ చేస్తూ, అందరితో శభాష్‌ అనిపించుకుంటోంది. అందుకే నామినేట్‌ అయినా సరే ప్రేక్షకులు ఓట్లేసి మరీ గెలిపిస్తున్నారు. బిగ్‌బాస్‌ ఇంట్లోకి వచ్చే ముందు దేత్తడి హారికగా నెటిజన్లకు పరిచయం ఉన్న హారిక… ఇప్పుడు రౌడీ బేబీగా అలరిస్తోంది. మరి ఈ రౌడీ బేబీ గురించి ఆసక్తికర విషయాలు చూద్దామా!

* హారిక సెప్టెంబరు 4, 1997 న హైదరాబాద్‌లో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. మెహదీపట్నంలోని సెయింట్‌ ఆన్స్‌ కాలేజీలో బీబీఏ పూర్తి చేసింది. ఆ తర్వాత అమెజాన్‌లో ఐటీ కన్సల్టెంట్‌గా ఉద్యోగం సంపాదించింది. ఎనిమిది నెలలు జాబ్‌ చేసి చేశాక ఎంబీఏలోకి వెళ్దాం అనుకుంది.

* స్కూల్‌ చదివేటప్పుడు హారిక కల్చరల్‌ క్లబ్‌ సెక్రటరీగా చేసేది. అలా అప్పటి నుంచే ఆమెకు కల్చరల్‌ యాక్టివిటీస్‌ అంటే ఇష్టం. డ్యాన్స్‌ అంటే అప్పటి నుంచే ఆసక్తి చూపించేది.

* స్కూల్‌లో ఏడో తరగతి చదువుకునే రోజుల్లోనే ఓ క్రష్‌ ఉండేది. క్లాస్‌ రూమ్‌లో పుస్తకాలు ఇచ్చేటప్పుడు ఓ అబ్బాయి ఆమెను చూసి పాటపాడేవాడట. కొద్ది రోజులకు అబ్బాయి అంటే ఇష్టం ఏర్పడింది. కానీ 8వ తరగతికి వచ్చేసరికి ఆ అబ్బాయి స్కూల్‌ మారిపోయాడు. దాంతో ఆ క్రష్‌ అలా ఉండిపోయింది. ఇప్పుడు అందరూ టామ్‌ బాయ్‌లానే చూస్తున్నారట. అందుకే ప్రపోజ్‌ చేయడానికి ఎవరూ ముందుకు రారంట.

* ఉద్యోగం చేస్తున్నా… ఎక్కడో అసంతృప్తిగానే ఉండేది. క్రియేటివ్‌గా ఏదైనా చేద్దామని అనుకుంటూ ఉండేది. అదే ఆమెను నటనవైపు తీసుకొచ్చింది. ‘చిత్ర విచిత్రం’ అనే షార్ట్‌ ఫిలింతో నటన రంగంవైపు వచ్చిన హారిక ..,. ‘దేత్తడి’ వెబ్‌సిరీస్‌తో స్టార్‌ అయిపోయింది.

* ‘దేత్తడి’ ఛానల్‌ నేమ్‌తో హారిక చేసిన వీడియోలకు మంచి స్పందన వచ్చింది. ‘తెలంగాణ పిల్ల బేరం ఆడతా’, ‘ది పర్‌ఫెక్ట్‌ సేల్స్‌ గాళ్‌’ లాంటి సిరీస్‌లు ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఆ తర్వాత చేసిన ప్రతి వీడియోకు మంచి స్పందన వస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ ఛానల్‌కు 14 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

* హారికకు సమయం దొరికినప్పుడల్లా ట్రావెలింగ్‌ చేస్తుంటుంది. హారికకు చిన్నతనం నుంచి దొంగతనం చేయాలని కోరికగా ఉండేది. అలా ఒకసారి గోవా వెళ్లినప్పుడు హోటల్‌లో ఫుల్‌గా తినేసి ₹10 వేలు బిల్‌ కట్టకుండా వచ్చేసిందట.

* వెబ్‌ సిరీస్‌ల్లో ఆమె నటకు ఫిదా కాని నెటిజన్‌ లేడంటే అతిశయోక్తి కాదు. ఏపీ ప్రభుత్వం నుండి ‘బెస్ట్‌ యూట్యూబర్‌ అవార్డు’ను హారిక గెలుచుకుంది. అలాగే ‘బెస్ట్‌ కామెడీ కంటెంట్‌ క్రియేటర్‌’ పురస్కారం కూడా దక్కించుకుంది.

* అర్జున్‌ రెడ్డి తమిళ వెర్షన్‌ ‘ఆదిత్య వర్మ’లో హారిక నటించింది. అందులో ఓ నర్స్‌గా కనిపించింది. ఆమెను వీడియోల్లో చూసి ఆ పాత్రకైతే బాగుంటుందని ఎంపిక చేశారట.

* హారిక ఈ స్థాయికి చేరుకోవడానికి ఆమె తల్లి చాలా సపోర్టు చేశారు. ఆమె ఎంకరేంజ్‌మెంట్‌తోనే ఇప్పుడు బిగ్‌బాస్‌లో అడుగుపెట్టింది. హారికను ఇంట్లో జెర్రీ, బంగారు తల్లి అని ముద్దుగా పిలుస్తారు.

* హారికకు పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం. వాటి ఫొటోలను ఎప్పటికప్పుడు పోస్ట్‌ చేస్తూ ఉంటుంది. అలాగే హారికకు టాటూలు అంటే ఇష్టం. హెచ్‌ అనే టాటూ ఎడమ చేతిపై ఉంది.

 

View this post on Instagram

 

PURE HAPPINESS<3

A post shared by Alekhya Harika (@alekhyaharika_) on

* ‘షో మస్ట్‌ గో ఆన్‌…’ అనే పాట అంటే హారికకు చాలా ఇష్టం. రోజూ ఇంటి నుంచి బయటకు వచ్చే ముందు ఆ పాట కచ్చితంగా ఉంటుంది. ‘షో మస్ట్‌ గో ఆన్‌…’ టాటూ కూడా వేయించుకోవాలని అనుకుంది.

* హీరోయిన్‌గానే చేయాలని లేదు. మంచి పాత్ర ఉండాలి. అది జనాల్లో గుర్తుండిపోవాలి అనేది నా ఆలోచన. కొన్ని ఆడిషన్స్‌కు అటెండ్‌ అయ్యింది.

* పూరి జగన్నాథ్‌ గారి ఆలోచనా విధానం అంటే బాగా ఇష్టపడుతుంది. ఆయన ఆలోచన థగ్‌ లైఫ్‌ అలా అనిపిస్తుందట.

* ఇక పెళ్లి విషయానికొస్తే… నన్ను భరించేటోడుని పెళ్లి చేసుకుంటాను అని చెబుతుంటుంది హారిక. అయితే చేసుకోబేయేవాడు తన కంటే హైట్‌ ఉండాలని కచ్చితంగా చెబుతుంది.

* హారికకు నిత్య మేనన్‌ అంటే చాలా ఇష్టం. అలాగే సమంత, ఇలియానా అన్నా ఇష్టపడుతుంది. ఇక దర్శకుల విషయానికొస్తే గౌతమ్‌ మేనన్‌, పూరి జగన్నాథ్‌, సుకుమార్‌ అంటే ఇష్టపడుతుంది. ఇక హీరోల్లో విజయ్‌ దేవరకొండ అంటే క్రష్‌. రానా, ధనుష్‌ అంటే ఇష్టపడుతుంది.

* ఆఖరి మాట… హారికను అందరూ అక్క అని పిలుస్తుంటారట. ఒక్కోసారి యూనివర్శల్‌ అక్క అయిపోతానేమో అనిపిస్తుంటుంది అని నవ్వుకుంటుంది హారిక.

1

 

2

3

 

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

 

50

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

Share.