2 ఇండస్ట్రీ హిట్లు.. 4 హిట్లు.. ఇచ్చిన కాంబోలో చివరి చిత్రం అలా మిస్ అయ్యిందట..!

దివంగత టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ … అప్పటి స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి.. వారికి హిట్లు ఇచ్చాడు. అయితే నందమూరి బాలకృష్ణతో ఎక్కువ సినిమాలు చెయ్యగా.. దాదాపు అన్నీ హిట్లే కావడం విశేషం. ఇందులో రెండు ఇండస్ట్రీ హిట్లు.. 4 హిట్లు.. 1 ప్లాప్ ఉండడం గమనార్హం. అందుకే ఈ కాంబినేషన్ అంటే అంచనాలు భారీ రేంజ్లో ఉండేవట. మంగమ్మ గారి మనవడు,ముద్దుల కృష్ణయ్య,మువ్వగోపాలుడు, భారతంలో బాలచంద్రుడు,ముద్దుల మావయ్య,బాల గోపాలుడు,ముద్దుల మేనల్లుడు వంటి చిత్రాలు వచ్చాయి.

వీటిలో ఒక్క ‘భారతంలో బాలచంద్రుడు’ మాత్రమే ప్లాప్ అయ్యింది. ఇలా వీరి కాంబినేషన్లో 7 సినిమాలు రావడం జరిగింది. అయితే 8వ చిత్రంగా ‘విక్రమసింహా’ అనే చిత్రం కూడా ప్రారంభమయ్యిందట.ఈ చిత్రం 60శాతం షూటింగ్ కూడా పూర్తయ్యింది.కానీ అనూహ్యంగా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిందట. దీనికి ప్రధాన కారణం ‘విక్రమ్ సింహా’ నిర్మాత అయిన ఎస్.గోపాల్ రెడ్డి గారు ఈ అనూహ్యంగా మరణించడం అనే తెలుస్తుంది. ఆ తరువాత ఆయన కొడుకు భార్గవ్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ ను ఫినిష్ చెయ్యలేకపోయారట.

బడ్జెట్ కూడా ఎక్కువ పెట్టాల్సి వస్తుందని ఆయన జంకినట్టు తెలుస్తుంది. అటు తరువాత భార్గవ్ రెడ్డి కూడా మరణించారు. అందుకే ఈ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఈ ప్రాజెక్టుని ఎలాగైనా ఫినిష్ చెయ్యాలని కోడి రామకృష్ణ గారే నిర్మాతగా మారాలని ప్రయత్నించారట. కానీ అది కూడా వర్కౌట్ కాలేదని తెలుస్తుంది.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.