సంక్రాంతి సినిమాల్ని వాడేస్తున్న నాగ శౌర్య..!

‘ఒక్కోసారి మనం బరిలో ఉండడం కంటే బయటుండడమే బెటర్’.. అంటున్నాడు మన యంగ్ హీరో నాగ శౌర్య. ఆయన నటించిన తాజా చిత్రం ‘అశ్వద్ధామ’. రమణ తేజ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 31న విడుదల కాబోతుంది. మెహ్రీన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం టీజర్ ఈ మధ్యే విడుదలై మంచి రెస్పాన్స్ ను అందుకుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం కచ్చితంగా హిట్ అవుతుందని ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Unique promotions for Aswathama movie

ఇదిలా ఉంటే.. ఈ సంక్రాంతి విడుదలయ్యే సినిమాలకి ఆల్ ది బెస్ట్ చెబుతూ ‘అశ్వద్ధామ’ నిర్మాతలు అయిన ‘ఐరా క్రియేషన్స్’ వారు ఓ వీడియోని విడుదల చేశారు. ఈ వీడియోలో ‘దర్బార్’ ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ ‘ఎంత మంచివాడవురా’ చిత్రాలని పందెం కోట్లతో పోలుస్తూ.. వాటికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు హీరో నాగ శౌర్య. ఈ విధంగా తన సినిమాని కూడా చాలా కూల్ గా ప్రమోట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఏమైనా ఈ కుర్ర హీరో తెలివితేటలకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే.


దర్బార్ సినిమా రివ్యూ & రేటింగ్!
అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.