Bigg Boss: రెట్టింపు జోష్ తో ‘బిగ్ బాస్5’.. 5 మంది కంటెస్టెంట్లు ఫైనల్..!

నార్త్ లో పాపులర్ అయిన ‘బిగ్ బాస్’ రియాలిటీ షో.. సౌత్ లోని అన్ని భాషల్లో కూడా 2017లో ప్రారంభమయ్యి సూపర్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను ఈ షో అమితంగా ఆకట్టుకుందనే చెప్పాలి.హౌస్ లో కంటెస్టెంట్ ల మధ్య జరిగే వాగ్వివాదాలు, ఫిజికల్ టాస్క్ లు వంటి వాటికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇప్పటికే 4 సీజన్లు పూర్తయ్యాయి. అవన్నీ కూడా సూపర్ హిట్ కావడం విశేషం.

ఇప్పుడు 5వ సీజన్ కు కూడా సన్నాహాలు మొదలయ్యాయి అని ఇన్సైడ్ టాక్. అందుతోన్న సమాచారం ప్రకారం.. కంటెస్టెంట్ ల ఎంపిక కూడా సీక్రెట్ గా మొదలయ్యిందని తెలుస్తోంది. ఈసారి రెట్టింపు జోష్ తో ‘బిగ్ బాస్5’ ఉండబోతుందట. గ్లామర్ కూడా నిండుగా ఉండే విధంగా ‘బిగ్ బాస్’ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం ఇప్పటికే వారు ముగ్గురు హీరోయిన్లను సంప్రదించారట. ‘బిగ్ బాస్4’ సెలబ్రిటీలు అందరూ బాగా ఫేమస్ అయ్యి..

సినిమాల్లో అవకాశాలు సంపాదించుకున్న నేపథ్యంలో.. వీళ్ళు కూడా ‘బిగ్ బాస్5’ లో పాల్గొనడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది. వీరితో పాటు ఇద్దరు హీరోలను కూడా ‘బిగ్ బాస్’ నిర్వాహకులు సంప్రదించారట. వాళ్ళు కూడా పాజిటివ్ గా స్పందించినట్టు భోగట్టా. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీలు కూడా ఈ సీజన్లో పాల్గొనే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.నాగార్జునే ఈసారి కూడా హోస్ట్ గా వ్యవహరించబోతున్నారట.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Share.