ప్రముఖ దర్శకుడి పై చీటింగ్ కేసు నమోదు చేసిన నటి..!

సినీ ఇండస్ట్రీలోనే కాదు చాలా రంగాల్లో ఇవి చూస్తూనే వస్తున్నాం. కాస్త పై పొజిషన్లో ఉన్న వాళ్ళు క్రింద ఉన్న వాళ్లకు ఏదో ఒక ఆఫర్ ఇచ్చి వాళ్ళను వాడుకోవడం.. తరువాత పొమ్మనడం కామన్ అయిపోయింది. ఈ విషయాలను ఆలస్యంగా గ్రహించిన మహిళలు పోలీసులను ఆశ్రయించడం జరుగుతుంది. సరిగ్గా ఇప్పుడు కూడా అలాంటి సంఘటనే చోటు చేసుకుంది.ఓ యువ దర్శకుడు ప్రముఖ టీవీ నటిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఆమెను అనుభవించి చివరికి పెళ్లి అంటే పొమ్మన్నాడు.

ముంబయిలోని వెర్సోవా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబయికి చెందిన ఓ టీవీ నటికి అలాగే యంగ్ డైరెక్టర్‌కు గత రెండు సంవత్సరాలుగా పరిచయముందట. ఈ నేపథ్యంలో ఆమెకు మంచి లైఫ్ ఇస్తాను అలాగే పెళ్లి చేసుకుంటాను అని ఆ దర్శకుడు ఆమెను..బలవంతంగా అనుభవించి.. కోరిక తీర్చుకుని.. మోజు తీరాక సైడ్ అయిపోయాడని తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆలస్యంగా గమనించిన నటి..

పెళ్లి విషయమై అతన్ని నిలదీయగా అతను తప్పించుకుని తిరుగుతున్నాడట. దాంతో ఈమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఈమె కంప్లైంట్ ను స్వీకరించిన పోలీసులు.. ఆ డైరెక్టర్ పై ఐపీసీ సెక్షన్‌ 376 ప్రకారం కింద అత్యాచారం కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చెయ్యడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Share.