పక్కాగా ఫ్యామిలీ అండ్ మాస్ ఆడియెన్స్ ను టార్గెట్ చేశారు..!

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా ‘నిన్ను కోరి’ ‘మజిలీ’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం ‘ట‌క్ జ‌గ‌దీష్’. ఇది నాని కెరీర్‌లో 26వ చిత్రం కావడం విశేషం.’షైన్ స్క్రీన్స్’ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు. రీతు వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ లు హీరోయిన్లుగా నటిస్తుండగా జగపతి బాబు,న‌రేష్‌, రావు ర‌మేష్‌, రోహిణి, నాజ‌ర్‌, డానియ‌ల్ బాలాజీ, తిరువీర్, దేవ‌ద‌ర్శిని, ప్ర‌వీణ్ త‌దిత‌రులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఎస్‌.ఎస్. త‌మ‌న్ సంగీతం అందిస్తుండగా.. ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫీ అందిస్తున్నాడు.సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చెయ్యబోతున్నారు దర్శకనిర్మాతలు. రేపు అంటే ఫిబ్రవరి 24న హీరో నాని పుట్టినరోజు కావడంతో ‘టక్ జగదీష్’ టీజర్ ను తాజాగా విడుదల చేశారు. నాని – శివ నిర్వాణ ఈ సారి పక్కాగా ఫ్యామిలీ అండ్ మాస్ ఆడియెన్స్ ను టార్గెట్ చేసినట్టు స్పష్టమవుతుంది. టీజర్ లో ఒక్క డైలాగ్ లేదు. త్రివిక్రమ్ స్టైల్ లో ఓ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ మాత్రమే ఉంది.

నిన్ను చూసి నికరంగా రొమ్ము విరుచుకున్నాది అంటూ టీజర్ చివర్లో వచ్చే లిరిక్ హైలెట్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. మణిరత్నం తెరకెక్కించిన ఘర్షణ సినిమా థీమ్ ను సరికొత్తగా ఎలివేట్ చేసినట్టు ఉన్నాడు దర్శకుడు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగే కథ ఇదని తెలుస్తుంది. టీజర్ అయితే ఆకట్టుకునే విధంగానే ఉంది. నెగిటివ్ పాయింట్ ఏంటంటే.. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి ఇలాంటి టీజర్ రెడీ చేసుకున్నట్లు ఉన్నారు. కానీ సమ్మర్ కి రిలీజ్ అవుతుంది ఈ సినిమా..!


పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.