దొరసాని టీజర్ కి ప్రశంసలకంటే.. మీమ్స్ ఎక్కువ వస్తున్నాయి

ఇండస్ట్రీకి వారసులు కొత్త కాదు, చిరంజీవి ఫ్యామిలీ నుంచే ఒక క్రికెట్ టీం కి సరిపడా హీరోలున్నారు. ఇక అక్కినేని, నందమూరి, ఘట్టమనేని కుటుంబాల నుంచి కూడా నట వారసులు వస్తూనే ఉన్నారు. ఈ వారసుల జాబితాలో రీసెంట్ గా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా చేరాడు. ఆనంద్ దేవరకొండ పరిచయ చిత్రం “దొరసాని” టీజర్ ఇవాళ విడుదలైంది. రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక కథానాయికగా నటించిన ఈ చిత్రం పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కింది.

పాపం ఇలా టీజర్ విడుదలైందో లేదో.. జనాలు విజయ్ దేవరకొండ తమ్ముడ్ని ఆడుకోవడం మొదలెట్టారు. దాదాపుగా అన్నీ నెగిటివ్ కామెంట్స్ ఉండడం గమనార్హం. సోషల్ మీడ్యా ట్రోలింగ్ అనేది ఈ కాలంలో చాలా కామన్ అయినప్పటికీ.. విజయ్ దేవరకొండ అంటే తట్టుకొని నిలబడగలిగాడు కానీ ఆనంద్ కి అంత పాజిటివ్ & డేరింగ్ యాటిట్యూడ్ ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే.. “దొరసాని” టీజర్ ను ఇప్పటివరకూ విజయ్ దేవరకొండ షేర్ చేయకపోవడం గమనార్హం.

Share.