‘అల వైకుంఠపురములో’ థాంక్స్ మీట్ లో నవదీప్ పై ఫన్నీ కామెంట్స్ చేసిన త్రివిక్రమ్..!

హీరోగా కెరీర్ ను మొదలుపెట్టి రెండు, మూడు హిట్లు అందుకున్నప్పటికీ ఎందుకో క్రేజ్ సంపాదించుకోలేకపోయాడు నవదీప్. అయితే తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆర్య2’ ‘బాద్ షా’ ‘ధృవ’ ఇప్పుడు ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో నటించాడు.

Trivikram Speech at Ala Vaikunthapurramuloo thanks meet1

అయితే ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో నవదీప్ పాత్ర అంత గొప్పగా ఎమీ ఉండడు. బహుశా అందుకేనేమో ఇటీవల జరిగిన థాంక్స్ మీట్ లో దర్శకుడు త్రివిక్రమ్ .. ఈ కుర్ర హీరో గురించి మాట్లాడటం మరిచిపోయాడు. అయితే నవదీప్ .. బన్నీ బెస్ట్ ఫ్రెండ్స్. బయట బావ.. బావ అని పిలుచుకుంటారు. ఈ విషయాన్ని ఇటీవల ఓ సందర్భంలో కూడా బన్నీ చెప్పాడు. అందుకే త్రివిక్రమ్ … ‘నవదీప్ గురించి మరిచిపోయినందుకు సారీ.. ! దీని గురించి అతనేమీ ఫీల్ అవ్వడు కానీ.. మా ఆవిడ మాత్రం నన్ను తిట్టేస్తుంది. నవదీప్ ను ‘బిగ్ బాస్’ లో చూసినప్పటి నుండీ మా ఆవిడ అతనికి ఫ్యాన్ అయిపోయింది. అతనికోసం ఓసారి షూటింగ్ జరుగుతున్న టైం లో ప్యారిస్ కు కూడా వచ్చేసింది’ అంటూ ఫన్నీ గా చెప్పుకొచ్చాడు.


సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Share.