కామెడీ విషయంలో హైపర్ ఆది సహాయం త్రివిక్రమ్ ఆశిస్తాడా

ఒక రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేస్తోంది. ఆదేంటంటే.. “అల వైకుంఠపురములో” సినిమా కోసం కామెడీ సన్నివేశాలు రాయడం కోసం దర్శకరచయిత త్రివిక్రమ్ “జబర్దస్త్” ఫేమ్ హైపర్ ఆది సహాయం తీసుకొనున్నాడని, ఆల్రెడీ ఆది కొన్ని మాటలు రాయడం మొదలెట్టాడని వార్తలు హల్ చల్ చేయడం మొదలెట్టాయి. దాంతో త్రివిక్రమ్ ను ముద్దుగా గురూజీ అని పిలుచుకొనే వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

trivikram-shows-more-interest-on-hyper-aadi1

ఈమధ్యకాలంలో త్రివిక్రమ్ సినిమాల్లో మునుపటి స్థాయి కామెడీ తగ్గింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగని.. ఆయన డైలాగ్ టైమింగ్ లో కూడా కొదవలేదు. అందుకని మరీ హైపర్ ఆది సహాయం తీసుకొంటున్నాడని వార్తలు రావడం మాత్రం బాలేదు. మరి ఈ విషయంలో త్రివిక్రమ్ & గ్యాంగ్ ఎవరైనా రెస్పాండ్ అయ్యి క్లారిటీ ఇస్తే బాగుండు. ఎందుకంటే.. ఇలాంటి వార్తలు ఆయన స్థాయిని తగ్గించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇకపోతే.. అల వైకుంఠపురములో షూటింగ్ ప్రస్తుతం హైద్రాబాద్ లో జరుగుతోంది. జనవరికి విడుదలకానున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా.. టబు కీలకపాత్ర పోషిస్తోంది.

Share.