రెడ్ ఫంక్షన్ లో మాస్టర్ ఎమోషనల్..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యాక్ట్ చేసిన రెడ్ సినిమా సంక్రాంతికి కానుకగా జనవరి 14వ తేదిన విడుదల కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇప్పుడు ఈ వీడియో ట్రెండింగ్ లో ఉంది. ఫస్ట్ టైమ్ త్రివిక్రమ్ ఇలా స్టేజ్ పైన కన్నీళ్లు పెట్టుకోవడం ఫ్యాన్స్ అందర్నీ కదిలిస్తోంది. ఈ వీడియోని కట్స్ కట్స్ గా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు సినీ అభిమానులు.

రెడ్ సినిమా ఫంక్షన్ లో త్రివిక్రమ్ తన మనసులో మాటలు మాట్లాడుతూ.., స్రవంతి రవికిశోర్ గారికి నేను చాలా రుణపడి ఉన్నానని, ఇంత ప్యాషన్ ఉన్న వ్యక్తి పరిశ్రమలో ఉండాల్సిన అవసరం ఉందని, రామానాయుడు గారి తర్వాత అంత శ్రద్ధగా స్క్రిప్ట్ చదివే వ్యక్తి ఈయనేనని అన్నారు. అంతేకాదు, అప్పటి రోజుల్ని తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యారు త్రివిక్రమ్. ఇలాగే ఎన్నో సంవత్సరాలు ఇంకెంతో మంది ప్రతిభని ఆయన ఇలాగే ప్రోత్సాహించాలని,

రామ్ కొడుకుని కూడా రవికిశోర్‌గారే లాంచ్ చేయాలని త్రివిక్రమ్ చెప్తూ సభా ముఖంగా రవికిషోర్ పాదాలకి అభివాదం చేశారు. అక్కడే హీరో రామ్ ని, రవికిషోర్ ని పట్టుకుని తన పాత జెర్నీని గుర్తుచేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో ట్రెండింగ్ అవుతోంది. గురూజీ స్పీచ్ కి కూడా ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పిన సుమ మాటలు నిజమయ్యేలా దీన్ని షేర్ చేస్తున్నారు అభిమానులు. అదీ విషయం.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Share.