టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

టాలీవుడ్లో స్టార్ హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు,చరణ్, ఎన్టీఆర్ , అల్లు అర్జున్ వంటి హీరోలు ప్రస్తుతం మన టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోలు. వీళ్ళు తిప్పి కొడితే సంవత్సరానికి ఒక్క సినిమానే చేస్తుంటారు. ఇక సీనియర్ స్టార్ హీరోలు చిరు, బాలయ్య, వెంకటేష్, నాగార్జున వంటి వాళ్ళది సెపెరేట్ ట్రాక్. వాళ్ళ ఏజ్ కు తగిన కథ సెట్ అయితేనే.. సినిమా చేస్తుంటారు.

అయితే ఈ రెండు ట్రాక్ లతో పాటు మరో ట్రాక్ కూడా ఉంది. వాళ్ళే మీడియం రేంజ్ హీరోలు. సోషల్ మీడియాలో వీళ్ళను ‘టైర్ 2 హీరోలు’ అంటుంటారు. ఏడాదికి ఎంత కాదనుకున్నా.. వీళ్ళు రెండేసి సినిమాలు చేస్తుంటారు. కొత్త కొత్త దర్శకులకు అందుబాటులో ఉంటూ.. ఎక్కువ సినిమాలు చేస్తూ .. సినిమా పై బ్రతికే ప్రతీ ఒక్కరికి చేతినిండా పని కల్పించేది వీళ్ళే. అంతేకాదు థియేట్రికల్ రైట్స్ పరంగా రూ.30కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు కూడా..! మరి వీళ్ళెవరో ఓ లుక్కేద్దాం రండి :

1) నాని:

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాని సినిమాలకు.. రూ.35కోట్ల వరకూ మార్కెట్ ఉంది.

2) విజయ్ దేవరకొండ:

మన రౌడీబాయ్ విజయ్ దేవరకొండ సినిమాలకు కూడా రూ.30 కోట్ల మార్కెట్ ఉంది.

3) వరుణ్ తేజ్:

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ‘ఫిదా’ ‘తొలిప్రేమ’ ‘గద్దల కొండ గణేష్’ చిత్రాలతో రూ.30కోట్ల మార్కెట్ ను ఏర్పరుచుకున్నాడు.

4) నితిన్:

మన యూత్ స్టార్ నితిన్ కు కూడా రూ.30కోట్ల మార్కెట్ ఉంది. ‘భీష్మ’ తో ఆ విషయం మరోసారి ప్రూవ్ అయ్యింది.

5) నాగ చైతన్య:

కామ్ గా ఉంటాడు గానీ .. మన చైతూకి కూడా రూ.30కోట్ల మార్కెట్ ఉంది. తన గత చిత్రాలు అయిన ‘మజిలీ’ ‘వెంకీమామ’… రూ.38కోట్ల వరకూ కలెక్ట్ చేసాయి.

6) రామ్ పోతినేని:

ఎనర్జిటిక్ స్టార్ కు కూడా ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో రూ.30కోట్ల మార్కెట్ ఏర్పడింది.

7) రవితేజ:

మన మాస్ మహారాజ్ మార్కెట్ రూ.30కోట్లు ఉంది. సరైన హిట్టు పడితే అది రూ.40కోట్లు దాటే ఛాన్స్ కూడా ఉంటుంది.

8) గోపీచంద్:

ఇప్పుడు 25కోట్ల మార్కెట్ ఉంది… మన యాక్షన్ హీరో గోపీచంద్ కు..! సరైన హిట్టు పడాలే కానీ రూ.30కోట్ల మార్కెట్ ఏర్పడుతుంది.

9) శర్వానంద్:

ఇతని సినిమాలకు కూడా రూ.30కోట్ల మార్కెట్ ఉంది. ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ అయితే అది రూ.35 కోట్ల వరకూ ఏర్పడుతుంది.

10) అఖిల్:

ఇంకా ఆశించిన విజయం దక్కలేదు..అయినా అఖిల్ క్రేజ్ అంతా ఇంతా కాదు. తన మొదటి సినిమా నుండీ కూడా రూ.30 కోట్ల మార్కెట్ ను మెయింటైన్ చేస్తున్నాడు.

Share.